భారత్‌పై విజృంభిస్తా: రవూఫ్‌

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ భారత్‌కు హెచ్చరికలు పంపాడు. మెల్‌బోర్న్‌ తన సొంత మైదానం లాంటిదని ఇక్కడ టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్‌

Published : 30 Sep 2022 02:28 IST

లాహోర్‌: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ భారత్‌కు హెచ్చరికలు పంపాడు. మెల్‌బోర్న్‌ తన సొంత మైదానం లాంటిదని ఇక్కడ టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థితో ఆడే మ్యాచ్‌లో విజృంభిస్తానని అన్నాడు. ‘‘పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేస్తే నన్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు అంత సులభం కాదు. ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాతో ఆడే తొలి మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ మైదానంలో కావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మెల్‌బోర్న్‌ నా సొంత మైదానం లాంటిది. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తాను. ఇక్కడ పిచ్‌ పరిస్థితులపై అవగాహన ఉంది. భారత్‌పై ఎలా బంతులు వేయాలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. గత టీ20 ప్రపంచకప్‌లో ఆ ఒత్తిడిని అనుభవించా. ఆసియాకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అంత ఒత్తిడిగా అనిపించలేదు.. ఎందుకంటే సత్తా చాటుతాననే నమ్మకం కలిగింది’’ అని రవూఫ్‌ చెప్పాడు. యూఏఈలో జరిగిన గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఓడించడం పాక్‌కు అదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని