Kane williamson: విలియమ్సన్‌ను వద్దన్నారు

స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో కొనసాగనున్నాడు. ఈ ఏడాది ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. వివాదాస్పద రీతిలో సారథ్యం వదులుకున్న సంగతి తెలిసిందే.

Updated : 16 Nov 2022 10:30 IST

జడేజా చెన్నైతోనే...
వదిలేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన ఫ్రాంచైజీలు

స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో కొనసాగనున్నాడు. ఈ ఏడాది ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. వివాదాస్పద రీతిలో సారథ్యం వదులుకున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా ఐపీఎల్‌ పూర్తిగా ఆడలేదు. జట్టు యాజమాన్యంతో విభేదాలు కారణంగా అతడు ఇక చెన్నై జట్టులో కొనసాగడమే కష్టమని అంతా భావించారు. ఆశ్చర్యకర రీతిలో అతడిని సూపర్‌కింగ్స్‌ అట్టిపెట్టుకుంది. పదకొండేళ్లు జట్టు సాధించిన ఎన్నో అద్భుత విజయాల్లో భాగమైన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావోను వదులుకుంది. అతడొక్కడే కాదు.. చాలామంది స్టార్‌ ఆటగాళ్లను కొన్ని ఫ్రాంఛైజీలు వద్దనుకున్నాయి. కేన్‌ విలియమ్సన్‌, పూరన్‌లను సన్‌రైజర్స్‌ అట్టిపెట్టుకోలేదు. ముంబయి పొలార్డ్‌ సహా ఏకంగా 13 మంది ఆటగాళ్లను వద్దనుకుంది. పంజాబ్‌ జట్టు గత సీజన్‌ కెప్టెన్‌ మయాంక్‌ సహా చాలా మంది ఆటగాళ్లను పక్కన పెట్టేసింది. ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను అమ్మడానికి లేదా ఇతర ఫ్రాంఛైజీల నుంచి కొనడానికి గడువు మంగళవారంతో ముగిసింది. కొనసాగించనున్న ఆటగాళ్ల వివరాలను అన్ని ఫ్రాంఛైజీలు వెల్లడించాయి.    మినీ ఐపీఎల్‌ వేలం డిసెంబరు 23న కోచిలో జరగనుంది.


ఏ జట్టు ఎలా..

బెంగళూరు

వీళ్లను వదిలేసింది: బెరెన్‌డార్ఫ్‌,  అనీశ్వర్‌ గౌతమ్‌, మిలింద్‌, సిసోడియా, రూథర్‌ఫోర్డ్‌

మిగిలిన డబ్బు: రూ.8.75 కోట్లు

లఖన్‌వూ

వీళ్లను వదిలేసింది: ఆండ్రూ టై, అంకిత్‌ రాజ్‌పుట్‌, చమీర, లూయిస్‌, హోల్డర్‌, మనీష్‌ పాండే, నదీమ్‌

మిగిలిన డబ్బు: రూ.23.35 కోట్లు

గుజరాత్‌

వీళ్లను వదిలేసింది: గుర్బాజ్‌,  ఫెర్గూసన్‌, డ్రేక్స్‌, గుర్‌కీరత్‌, జేసన్‌ రాయ్‌, వరుణ్‌ ఆరోన్‌

మిగిలిన డబ్బు: రూ.19.25 కోట్లు

కోల్‌కతా

వీళ్లను వదిలేసింది: కమిన్స్‌, బిలింగ్స్‌, అమన్‌ ఖాన్‌, శివమ్‌ మావి, నబి,   కరుణరత్నె, ఫించ్‌, హేల్స్‌ (వైదొలిగాడు), తోమర్‌, రహానె, అశోక్‌ శర్మ, బాబా ఇంద్రజిత్‌, రమేశ్‌ కుమార్‌, రసిఖ్‌, ప్రథమ్‌, షెల్డన్‌ జాక్సన్‌

తీసుకుంది: శార్దూల్‌ ఠాకూర్‌, గుర్బాజ్‌, ఫెర్గూసన్‌

మిగిలిన డబ్బు: రూ.7.05 కోట్లు

పంజాబ్‌

వీళ్లను వదిలేసింది: మయాంక్‌   అగర్వాల్‌, ఒడియన్‌ స్మిత్‌, వైభవ్‌ అరోరా, బెన్నీ హోవెల్‌, ఇషాన్‌ పోరెల్‌, అనిష్‌ పటేల్‌, ప్రేరక్‌, సందీప్‌ శర్మ, రితిక్‌

మిగిలిన డబ్బు: రూ.32.2 కోట్లు

చెన్నై

వీళ్లను వదిలేసింది: డ్వేన్‌ బ్రావో, ఉతప్ప, మిల్నె, నిశాంత్‌, జోర్డాన్‌,   భగత్‌ వర్మ, అసిఫ్‌, జగదీశన్‌

మిగిలిన డబ్బు: రూ.20.45 కోట్లు

హైదరాబాద్‌

వీళ్లను వదిలేసింది: విలియమ్సన్‌, పూరన్‌, సుచిత్‌, ప్రియం గార్గ్‌,     సమర్థ్‌, షెపర్డ్‌, సౌరభ్‌ దూబె, అబాట్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్‌ గోపాల్‌,  సుశాంత్‌ మిశ్రా, విష్ణు వినోద్‌

మిగిలిన డబ్బు: రూ.42.25 కోట్లు

ముంబయి ఇండియన్స్‌

వీళ్లను వదిలేసింది: పొలార్డ్‌, అన్మోల్‌ప్రీత్‌, ఆర్యన్‌, థంపి, డేనియల్‌ సామ్స్‌, ఫాబియాన్‌ అలెన్‌, ఉనద్కత్‌, మయాంక్‌ మార్కండె, మురుగన్‌ అశ్విన్‌, రాహుల్‌ బుద్ధి, మెరెడిత్‌, సంజయ్‌ యాదవ్‌, మిల్స్‌

తీసుకుంది: బెరెన్‌డార్ఫ్‌

మిగిలిన డబ్బు: రూ. 20.55 కోట్లు

దిల్లీ

వీళ్లను వదిలేసింది: శార్దూల్‌ ఠాకూర్‌, సీఫెర్ట్‌, అశ్విన్‌ హెబ్బర్‌, కేఎస్‌ భరత్‌, మన్‌దీప్‌ సింగ్‌

తీసుకుంది: అమన్‌ ఖాన్‌

మిగిలిన డబ్బు:రూ.19.45 కోట్లు

రాజస్థాన్‌

వీళ్లను వదిలేసింది: అనునయ్‌, బోష్‌, డరిల్‌ మిచెల్‌, నీషమ్‌, కరుణ్‌ నాయర్‌, కౌల్టర్‌నైల్‌, డసెన్‌, శుభమ్‌, తేజాస్‌ బరోకా

మిగిలిన డబ్బు: రూ.13.2 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని