వెళ్తూ వెళ్తూ ఓ సంచలనం
ఈసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇప్పటికే చాలా సంచలనాలు చూశాం. గ్రూప్ దశ చివర్లో ఇప్పుడు మరో చిన్న జట్టు మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చింది.
ఫ్రాన్స్‌పై 1-0తో ట్యునీసియా విజయం
ట్యునీసియా 1.. ఫ్రాన్స్ 0
దోహా
ఈసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇప్పటికే చాలా సంచలనాలు చూశాం. గ్రూప్ దశ చివర్లో ఇప్పుడు మరో చిన్న జట్టు మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చింది. ఆ పసికూన ట్యునీసియా కాగా.. ప్రత్యర్థి డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్. ఇప్పటికే రెండు విజయాలతో నాకౌట్ బెర్తు ఖరారు చేసుకుని ట్యునీసియాతో పోరును ప్రాక్టీస్‌లా వాడుకుందామని చూసిన ఫాన్స్‌కు పెద్ద షాకే తగిలింది. అవతల ఆస్ట్రేలియా.. డెన్మార్క్ మీద గెలవడం వల్ల ఆ జట్టుకే రెండో నాకౌట్ బెర్తు దక్కింది కానీ, లేదంటే ట్యునీసియానే ముందంజ వేసేది. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించినా ఈ విజయం ట్యునీసియాకు చిరస్మరణీయమే.
ఉత్కంఠభరితంగా ముగిసిన గ్రూప్-డి నాకౌట్ రేసులో ట్యునీసియా త్రుటిలో బెర్తును చేజార్చుకున్నప్పటికీ ఓ చిరస్మరణీయ విజయంతో సంతోషంగానే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో 1-0తో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు షాకిచ్చింది. 65 శాతం బంతిని తన నియంత్రణలోనే ఉంచుకున్నా.. ట్యునీసియాతో పోలిస్తే ఫ్రాన్స్ ఆటగాళ్లు రెట్టింపు పాస్‌లు అందించుకున్నా.. గోల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యారు. ఎంబాపె సహా కొందరు ఫ్రాన్స్ ఆటగాళ్లు మంచి అవకాశాలను వృథా చేశారు. ప్రథమార్ధంలో ఫ్రాన్స్ స్పష్టమైన పైచేయి సాధించినా.. ఆ జట్టు గోల్ కొట్టకుండా ట్యునీసియా రక్షణ శ్రేణి సమర్థంగా అడ్డుకుంది. ఇక ద్వితీయార్ధంలో కొంచెం దూకుడుగా కదిలిన ట్యునీసియా ఆటగాళ్లు 58వ నిమిషంలో మంచి అవకాశం సృష్టించుకున్నారు. లైదౌని తెలివిగా బంతిని చేజిక్కించుకుని ఖజ్రికి పాస్ అందించగా.. అతను ఇద్దరు ఫ్రాన్స్ డిఫెండర్లతో పాటు గోల్ కీపర్ మందండాను బోల్తా కొట్టించి నెట్‌లోకి బంతిని పంపించడంతో ట్యునీసియా సంబరాలకు అంతే లేకుండా పోయింది. అప్పటికి సమాంతరంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంకా గోల్ కొట్టకపోవడంతో ట్యునీసియాకు నాకౌట్ దారులు తెరుచుకున్నాయి. అయితే డెన్మార్క్‌పై 60వ నిమిషంలో గోల్ కొట్టడం, చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంతో ట్యునీసియాకు నిరాశ తప్పలేదు. అయినప్పటికీ.. మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో ఒక్క గోలూ కొట్టనివ్వకుండా విజయం సాధించడం ట్యునీసియాను సంబరాల్లో ముంచెత్తింది.
ఆఖర్లో హైడ్రామా: నిర్ణీత సమయం 90 నిమిషాలు పూర్తయి, ఇంజురీ టైం మొదలయ్యాక ఇంకో నిమిషం ఆటే మిగిలుండగా.. ఫ్రాన్స్ స్టార్ గ్రీజ్‌మన్ ట్యునీసియా బాక్స్‌లో బంతి అందుకుని మెరుపు షాట్‌తో నెట్‌లోకి పంపించేశాడు. దీంతో ట్యునీసియా ఆటగాళ్లు, అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు. కానీ రిఫరీ రీప్లే కోరగా.. అది ఆఫ్‌సైడ్ అని తేలడంతో ఫ్రాన్స్ ఖాతాలో గోల్ చేరలేదు. మ్యాచ్ ట్యునీసియా సొంతమైంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!