Sunil Gavaskar: ఎప్పుడూ స్కోరు బోర్డు వైపు చూడలేదు

ఆడే రోజుల్లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు తాను స్కోరు బోర్డు వైపు చూడలేదని, క్రీజులో ఉన్నప్పుడు ఎప్పుడూ లక్ష్యాలు పెట్టుకోలేదని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు.

Updated : 02 Dec 2022 07:54 IST

కోల్‌కతా: ఆడే రోజుల్లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు తాను స్కోరు బోర్డు వైపు చూడలేదని, క్రీజులో ఉన్నప్పుడు ఎప్పుడూ లక్ష్యాలు పెట్టుకోలేదని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు నేను స్కోరు బోర్డు వైపు చూసేవాణ్ని కాదు. ప్రతి బ్యాట్స్‌మనూ తనదైన రీతిలో లక్ష్యాలు పెట్టుకుంటాడు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోమని కోచ్‌లు చెబుతుంటారు. ముందు 10 పరుగులు, తర్వాత 20, ఆ తర్వాత 30 పరుగులను లక్ష్యంగా పెట్టుకోమంటారు. కానీ నేనైతే 30 పరుగులు లక్ష్యంగా పెట్టుకుంటే 24-25 దగ్గర ఒత్తిడికి గురవుతా. 30కి త్వరగా చేరుకోవడానికి ప్రయత్నిస్తా. ఆ పరిస్థితుల్లో ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని వెంటాడి ఎడ్జ్‌తో క్యాచ్‌ ఔటయ్యే ప్రమాదముంది’’ అని గావస్కర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు