లబుషేన్, హెడ్ శతకాలు
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు అదిరే ఆరంభం. లబుషేన్ (120 బ్యాటింగ్; 235 బంతుల్లో 11×4), ట్రావిస్ హెడ్ (114 బ్యాటింగ్; 139 బంతుల్లో 12×4) అజేయ శతకాలు బాదడంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
ఆస్ట్రేలియా 330/3
వెస్టిండీస్‌తో రెండో టెస్టు
అడిలైడ్: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు అదిరే ఆరంభం. లబుషేన్ (120 బ్యాటింగ్; 235 బంతుల్లో 11×4), ట్రావిస్ హెడ్ (114 బ్యాటింగ్; 139 బంతుల్లో 12×4) అజేయ శతకాలు బాదడంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా త్వరగానే ఓపెనర్ వార్నర్ (21) వికెట్‌ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (62), లబుషేన్ చక్కగా బ్యాటింగ్ చేయడంతో లంచ్ తర్వాత ఆ జట్టు 129/1తో నిలిచింది. కానీ ఖవాజా, స్మిత్ (0) వరుస ఓవర్లలో ఔటయ్యారు. ఆ తర్వాత హెడ్‌తో కలిసి లబుషేన్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా హెడ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. లబుషేన్, హెడ్ జంట అభేద్యమైన నాలుగో వికెట్‌కు 199 పరుగులు జోడించింది. టెస్టుల్లో లబుషేన్ పదో శతకం సాధించగా.. హెడ్ అయిదోసారి శతకాన్ని అందుకున్నాడు. గాయంతో కమిన్స్ దూరం కావడంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహిస్తున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్
-
Sports News
IND vs AUS: స్టీవ్ స్మిత్‌ని ఆ స్పిన్నర్ ఇబ్బందిపెడతాడు: ఇర్ఫాన్ పఠాన్
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?
-
Politics News
Revanth reddy: రాజ్‌భవన్ వేదికగా ఆ ఇద్దరూ డ్రామాకు తెరలేపారు: రేవంత్ రెడ్డి