Pant-Harleen Deol: ఇన్‌స్టాలో రిషభ్‌ పంత్‌ పోస్ట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన హర్లీన్ డియోల్

రోడ్డు ప్రమాదంగా గాయపడిన భారత యువ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) వేగంగా కోలుకుంటున్నాడు. ఇన్‌స్టాలో పంత్‌ చేసిన ఓ పోస్టుకు టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ హర్లీన్‌ డియోల్‌ (Harleen Deol) సరదాగా రిప్లై ఇచ్చింది. 

Published : 15 Jun 2023 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్‌ఇండియా యువ బ్యాటర్, వికెట్ కీపర్‌ రిషభ్ పంత్‌ (Rishabh Pant) వేగంగా కోలుకుంటున్నాడు. కాలికి శస్త్రచికిత్స జరగడంతో  దాదాపు మూడు నెలలపాటు మంచానికే పరిమితమైన పంత్.. ప్రస్తుతం ఎవరి సాయం లేకుండా నడుస్తున్నాడు. తాజాగా చేతి కర్ర, ఎవరి సాయం లేకుండా మెట్లెక్కెశాడు. ‘‘నాట్ బ్యాడ్ యార్ రిషబ్ ❤️❤️😂. సాధారణ విషయాలు కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి😇’’ అనే క్యాప్షన్‌ జోడించి తాను మెట్లెక్కుతున్న వీడియోని రిషభ్‌ తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేశాడు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పంత్‌.. త్వరగా కోలుకుని మళ్లీ టీమ్‌ఇండియా తరఫున ఆడాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. భారత మహిళా క్రికెటర్ హర్లీన్‌ డియోల్‌ (Harleen Deol) కూడా పంత్‌ చేసిన పోస్ట్‌కు రిప్లై ఇస్తూ అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. 

అయితే, హర్లీన్‌ డియోల్ అందరిలా కాకుండా ‘‘వెల్‌డన్‌ బాయ్. భాంగ్రా డ్యాన్స్‌ చేయడానికి సిద్ధంగా ఉండు 🤪’’ అని సరదాగా రిప్లై ఇచ్చింది. హర్లీన్‌ డియోల్‌ ఇచ్చిన రిప్లైకి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆమె చేసిన కామెంట్‌కు లైక్‌లు కొడుతూ మద్దతు తెలుపుతున్నారు. పంత్‌ చేసిన పోస్ట్‌కు టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ ‘‘😍😍💪💪❤️❤️’’ ఎమోజీలతో రిప్లై ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. పంత్‌ చివరగా 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో త్రుటిలో సెంచరీ మిస్‌ (93) చేసుకున్న అతడు..రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే వెనుదిరిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని