
PAK vs WI: సులభమైన క్యాచ్ నేలపాలు.. సిక్స్‌కు ప్రతీకారంగా వికెట్..
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫీల్డర్ సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేయగా.. సిక్స్‌కు ప్రతీకారంగా ఆ తర్వాతి బంతికే వెస్టిండీస్ బ్యాటర్‌ను పాక్ బౌలర్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
* ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం కారణంగా..
పాక్ బౌలర్ మహమ్మద్ నవాజ్ వేసిన ఎనిమిదో ఓవర్ రెండో బంతిని వెస్టిండీస్ బ్యాటర్ షమర్ బ్రూక్స్ గాల్లోకి లేపాడు. అయితే లాంగాన్‌లో ఉన్న మహమ్మద్ హస్నయిన్, డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఇఫ్తికర్ అహ్మద్ ఆ క్యాచ్‌ను అందుకోవడానికి పరిగెత్తారు. అయితే, ఇద్దరి మధ్య సమన్వయ లోపం కారణంగా క్యాచ్‌ను అందుకోకుండా చూస్తూ ఉండిపోయారు. దీంతో చేతుల దాకా వచ్చిన సులభమైన క్యాచ్ నేలపాలు అయ్యింది. ఇలాంటి ఘటనే కొన్నేళ్ల కిందట భారత్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకోవడం గమనార్హం. అప్పడు షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్ కూడా ఇలాగే క్యాచ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.
* సిక్స్‌కు ప్రతీకారంగా వికెట్..
ఆరో ఓవర్లో పాక్ బౌలర్ మహమ్మద్ వసీమ్ వేసిన ఐదో బంతిని క్రీజులో ఉన్న వెస్టిండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. అది 98 మీటర్ల దూరం వెళ్లింది. అయితే, ఆ తర్వాతి బంతిని తెలివిగా వేసిన వసీమ్.. కింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో తన బౌలింగ్‌లో కింగ్ బాదిన భారీ సిక్సర్‌కు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
► Read latest Sports News and Telugu News