Commonwealth Games: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో స్వర్ణం చేరింది.  వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణపతకం సాధించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు

Updated : 30 Jul 2022 23:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం దక్కింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల విభాగంలో స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను 201 కేజీల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది స్నాచ్‌ తొలి ప్రయత్నంలో 84 కేజీలు, రెండో ప్రయత్నంలో 88 కేజీలు విజయవంతంగా పూర్తి చేసిన చాను...మూడో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది.క్లీన్‌ అండ్‌ జర్క్‌ తొలి ప్రయత్నంలో 109 కేజీలు, రెండో ప్రయత్నంలో 113 కేజీలు ఎత్తిన మీరాబాయి.. మూడో ప్రయత్నంలో 119 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది. 2018 కామన్‌వెల్త్ క్రీడల్లో కూడా భారత్‌కు తొలి స్వర్ణం అందించింది మీరాబాయినే కావడం గమనార్హం. మరోవైపు వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇవాళ 3 పతకాలు దక్కాయి. వెయిట్‌లిఫ్టింగ్‌ 55కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ రజతం, 61 కేజీల కేటగిరిలో గురురాజ క్యాంసం సాధించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని