చెన్నై టెస్టు: రూట్‌ 150+, స్టోక్స్‌ 60+

టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌(156), బెన్‌స్టోక్స్‌(63) దూసుకుపోతున్నారు. 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన వీరిద్దరూ మరో వికెట్‌...

Updated : 06 Feb 2021 12:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌(156), బెన్‌స్టోక్స్‌(63) దూసుకుపోతున్నారు. 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 119 ఓవర్లకు 355/3 స్కోర్‌ సాధించింది. కాగా, రూట్‌కిది 100వ టెస్టు కావడం విశేషం. అయితే, ఇంతకుముందు శ్రీలంకతో ఆడిన 98, 99 టెస్టుల్లోనూ అతడు 150+ స్కోర్లు సాధించాడు. ఆ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 228, 186 పరుగులు సాధించాడు. అదే జోరుతో ఇప్పుడు హ్యాట్రిక్‌ శతకంతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా ఇప్పటివరకు రెండు వికెట్లు తీయగా, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. రెండో రోజు వికెట్లు తీసేందుకు టీమ్‌ఇండియా బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని