MeeraBai Chanu: 55 కేజీల విభాగంలోనూ కామన్వెల్త్‌ గేమ్స్‌కు మీరాబాయి

టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను..

Published : 25 Feb 2022 23:45 IST

ఇప్పటికే 49 కేజీల కేటగిరీలో అర్హత

ఇంటర్నెట్ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను 55 కేజీల విభాగంలో 2022 కామన్వెల్త్‌ క్రీడలకు అర్హత సాధించింది. సింగపూర్‌ వెయిట్‌లిఫ్టింగ్ ఇంటర్నేషనల్‌ పోటీల్లో బంగారుపతకం సొంతం చేసుకుంది. మొత్తం 191 కేజీలను (86 కేజీలు, 105 కేజీలు) లిఫ్ట్‌ చేసి చాను రికార్డు సృష్టించింది. మీరాబాయి తర్వాత ఆసీస్‌కు చెందిన జెస్సికా 167 కేజీలు (77 కేజీలు, 90 కేజీలు) ఎత్తి రజతం కైవసం చేసుకుంది. మలేషియా క్రీడాకారిణి కసాండ్రా ఎంగల్‌బెర్ట్‌ 165 కేజీలను (75 కేజీలు, 90 కేజీలు) లిఫ్ట్‌ చేసి మూడో స్థానంతో కాంస్య దక్కించుకుంది.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించడంపై మీరాబాయి చాను స్పందిస్తూ.. ఆరు నెలల కఠిన శిక్షణకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది. 55 కేజీలు, 49 కేజీల విభాగాల్లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించానని పేర్కొంది. కేంద్ర క్రీడల శాఖ, వెయిట్ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌, సాయ్‌, ఓజీక్యూ సహా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ర్యాంకింగ్స్‌ పరంగా 49 కేజీల కేటగిరీలో క్వాలిఫై కాగా.. సింగపూర్‌ పోటీల్లో విజయంతో 55 కేజీల విభాగంలో అర్హత దక్కించుకుంది. జులై 28 నుంచి ఆగస్ట్‌ 8వ తేదీ వరకు బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరుగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని