R Ashwin 100th Test: ఇది గమ్యాన్ని మించిన ప్రయాణం.. వందో టెస్టుపై అశ్విన్‌

కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin).. ఈ ప్రత్యేక సందర్భంపై స్పందించాడు.

Published : 05 Mar 2024 17:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : భారత్‌-ఇంగ్లాండ్‌ (IND vs ENG) టెస్టు సిరీస్‌లో ఆఖరిదైన అయిదో మ్యాచ్‌ టీమ్‌ఇండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)కు ఎంతో ప్రత్యేకం. అతడికిది వందో టెస్టు. ఈ ఘనత సాధించనున్న 14వ భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ ప్రత్యేక సందర్భంపై అశ్విన్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకమని.. గమ్యం కంటే ఎక్కువ అని పేర్కొన్నాడు.

‘‘100వ టెస్టు నాకే కాదు.. మా కుటుంబానికీ ఎంతో స్పెషల్‌. నా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆటగాడి ప్రయాణంలో కుటుంబీకుల కష్టం ఎంతో ఉంటుంది. క్రికెట్‌లో నేను ఏం చేశానో నా తండ్రి ఇప్పటికీ 40మందికి సమాధానం ఇవ్వగలరు’ అని అశ్విన్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

ఐదో టెస్టు జరిగే ధర్మశాల పరిస్థితులపై స్పందిస్తూ.. ‘‘21 ఏళ్ల క్రితం నేను ఇక్కడ అండర్‌-19 క్రికెట్‌ ఆడాను. చాలా చలిగా ఉంటుంది. కుదురుకోవడానికి సమయం పడుతుంది’’ అని వివరించాడు.

అశ్విన్‌ మ్యాజికా.. బెయిర్‌స్టో షోనా.. వందో టెస్టులో మెరిసేదెవరో!

ఇటీవలే టెస్టుల్లో అశ్విన్‌ 500 వికెట్ల ఘనత అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వందో టెస్టు ఆడుతున్న తొలి తమిళనాడు క్రికెటర్‌గా కూడా ఘనత సాధించనున్నాడు. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. 23.91 సగటుతో వికెట్లు పడగొట్టాడు.

ఈ టెస్టు సిరీస్‌ను 3-1తో టీమ్‌ఇండియా ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రమైన చివరి టెస్టులోనూ విజయం సాధించి తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్‌ సేన భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు