MS DHONI : ఎంఎస్ ధోనీ.. ఆ ఘనత సాధించిన రెండో భారతీయ ఆటగాడు

టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై ఆటగాడు ఎంఎస్ ధోనీ అరుదైన...

Published : 04 Apr 2022 01:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై ఆటగాడు ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. టీ20 లీగ్‌లో భాగంగా ఇవాళ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ ధోనీకి పొట్టిఫార్మాట్‌లో 350వది కావడం విశేషం. ఇందులో అంతర్జాతీయంగా 98 టీ20లు ఉండగా.. టీ20 లీగ్‌లో చెన్నై, పుణె తరఫున 223 మ్యాచ్‌లు ఆడాడు. మిగతా మ్యాచ్‌లను ఛాంపియన్స్‌ లీగ్‌లో ఆడాడు. ఇప్పటికే ధోనీ టీ20 కెరీర్‌లో ఏడువేల పరుగులను పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 

అంతర్జాతీయం సహా దేశవాళీ లీగ్‌ల్లో ధోనీ కంటే ముందున్న భారత ఆటగాడు ముంబయి సారథి రోహిత్ శర్మ. ఇప్పటి వరకు రోహిత్ 372 టీ20 మ్యాచుల్లో ఆడాడు. ధోనీ తర్వాత చెన్నై మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా (336), దినేశ్‌ కార్తిక్ (329), విరాట్ కోహ్లీ (328) ఉన్నారు. రైనా ఈసారి టీ20 లీగ్‌ ఆడటం లేదు. దినేశ్ కార్తిక్, విరాట్ కోహ్లీ ఒకే జట్టులో (బెంగళూరు) ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లను ఆడితేనే 350 మార్క్‌ దగ్గరకు చేరుకునే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని