Novak Djokovic: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. జకోవిచ్‌ ప్రాక్టీస్‌..

ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌ ఎట్టకేలకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కోసం ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గత బుధవారం...

Published : 11 Jan 2022 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌ ఎట్టకేలకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కోసం ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గత బుధవారం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న అతడు అనూహ్య పరిణామాల మధ్య కోర్టును ఆశ్రయించాడు. చివరికి కేసు గెలిచి రాడ్‌ లావర్‌లోని టెన్నిస్‌ కోర్టులో సాధన ప్రారంభించాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ సెర్బియన్‌ ఆటగాడు గతవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగానే బోర్డర్‌ ఫోర్స్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. వాక్సినేషన్‌కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేనందున అతడి వీసాను రద్దు చేయడంతో పాటు, అతడిని ఇమ్మిగ్రేషన్‌ నియంత్రణలోని ప్రత్యేక హోటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే న్యాయపోరాటం చేసిన జకోవిచ్‌ తాజాగా కేసు గెలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు అతడి వద్ద వైద్యపరమైన మినహాయింపులకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, దీంతో అతడి వీసాను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆంటోని కెల్లీ ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే జకోవిచ్‌ ఇప్పుడు తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. ఇక పదోసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌ కైవసం చేసుకొని తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌ స్లామ్‌ సాధించాలని ఆసక్తిగా ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని