IND vs NZ: కోచ్‌కిచ్చిన మాటను నిలబెట్టుకున్నా: శ్రేయస్ అయ్యర్‌

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా అరంగేట్ర ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులోనే శతకం చేయడంతో తన కోచ్‌ ప్రవీణ్‌..

Published : 27 Nov 2021 01:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా అరంగేట్ర ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులోనే శతకం చేయడంతో తన కోచ్‌ ప్రవీణ్‌ అమ్రేను డిన్నర్‌కి ఆహ్వానించే అర్హత సాధించానని శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అయ్యర్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

‘నా కోచ్‌ ప్రవీణ్ సర్‌ దగ్గర శిష్యుడిగా చేరినప్పటి నుంచి ఆయన నన్నెంతో ప్రోత్సహించారు. జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉందని చెప్పేవారు. అన్నింటికి మించి టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్‌ క్యాప్ అందుకోవడం గొప్ప విజయమని చెప్పేవారు. ఈ రోజు నేను టెస్టు క్యాప్ అందుకోవడం.. తొలి టెస్టులోనే శతకం చేయడం చూసి ఆయన చాలా సంతోషించి ఉంటారు. టెస్టు క్రికెట్లో సెంచరీ చేసిన తర్వాతే.. నీతో డిన్నర్‌కి వస్తానని నా కోచ్‌ ప్రవీణ్‌ అమ్రే సర్‌ చెప్పారు. ఈ రోజు సెంచరీ చేసిన తర్వాత ఆయనకు మెసేజ్‌ చేసి, డిన్నర్‌కి ఆహ్వానించాను. ఆయనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గర్వంగా ఉంది’ అని పేర్కొన్నాడు.

‘మా నాన్నకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ రోజు నేను చేసిన శతకం ఆయనకు అంకితం చేశాను. నా జీవితంలో సాధించిన గొప్ప విజయమిదే. నా క్రికెట్ కెరీర్‌లో తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. నా కెరీర్‌ ఆరంభం నుంచి నన్ను చాలా ప్రోత్సహించారు. నా ఎదుగుదలకు మూల స్తంభాలు వాళ్లే’ అని అయ్యర్‌ చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రేయస్‌ అయ్యర్‌ (105: 171 బంతుల్లో 13x4, 2x6) శతకంతో రాణించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని