Rohit Sharma: రోహిత్‌ రికార్డుకు కార్‌ నంబర్‌కు లింక్‌.. ఇంతకీ అదేంటంటే?

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma)కు విలాసవంతమైన లంబోర్గిని యూరస్‌ కారు ఉంది. ఈ కారుకు నంబర్‌కు వన్డే క్రికెట్‌లో అతడు నెలకొల్పిన రికార్డుకు లింక్‌ ఉంది. అదేంటంటే? 

Published : 10 Aug 2023 17:20 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌తోపాటు త్వరలో ఐర్లాండ్‌తో జరిగే పొట్టి సిరీస్‌కూ ఈ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. దీంతో వీరు ఈ ఖాళీ సమయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు.  రోహిత్‌ శర్మ (Rohit Sharma) కూడా మొన్నటివరకు అమెరికాలోనే ఉన్నాడు. గతవారం కాలిఫోర్నియాలో తన క్రికెట్ అకాడమీని ప్రారంభించి ఇటీవల ముంబయికి వచ్చాడు. 

తిలక్‌ వర్మను వన్డే ప్రపంచ కప్‌ జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్

తాజాగా రోహిత్‌ తన సతీమణి రితికా సజ్దెతో కలిసి రూ.4.20 కోట్ల ఖరీదు చేసే విలాసవంతమైన లంబోర్గిని యూరస్‌ (Laborghini Urus) కారులో అడీడాస్‌ స్టోర్‌కు వచ్చాడు. రోహిత్ రాకను గమనించిన అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. తమ అభిమాన క్రికెటర్‌ని చాలా దగ్గర నుంచి సంబరపడిపోయారు. కొంతమంది తమ చరవాణుల్లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? రోహిత్ కారు నెంబర్... వన్డే కెరీర్‌లో సాధించిన అరుదైన రికార్డుకు అతని కార్‌ నంబర్‌కు లింక్‌ ఉంది. వన్డేల్లో రోహిత్‌ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోరు 264. ఇదే నంబర్‌ను 0264గా తన కారు నంబర్‌గా తీసుకోవడం విశేషం. ఈ కారును గతేడాది మార్చిలో కొనుగోలు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు