Sachin Tendulkar: మంచి మనసు చాటుకున్న సచిన్‌.. వైరల్‌ వీడియో చూడండి!

టీమ్‌ఇండియా దిగ్గజం, బ్యాటింగ్‌ గ్రేట్‌ సచిన్‌ తెందూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా కాలమైనా ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాడు...

Published : 27 Feb 2022 14:31 IST

(Photo: Sachin Tendulkar Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజం, బ్యాటింగ్‌ గ్రేట్‌ సచిన్‌ తెందూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా కాలమైనా.. ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. తాజాగా అతడు ఓ బీచ్‌లో గాయపడిన పక్షికి సపర్యలు చేసి మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఆ వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకూ దానికి కోటి 30 లక్షల మందికి పైగా లైకులు కొట్టారు. ఆ వీడియోలో సచిన్‌ ఆ పక్షికి నీళ్లు తాగించే ప్రయత్నం చేయడంతో పాటు ఏదో ఆహారం కూడా పెట్టి కాస్త కోలుకునేలా చేశాడు. ‘మనం అందించే కాస్తంత ప్రేమ, ఆప్యాయత ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా మార్చుతుంది’ అని వ్యాఖ్యానం జతచేశాడు. కాగా, తెందూల్కర్‌ ఆ గాయపడిన పక్షిని ఎలా కాపాడాడో మీరూ చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని