Shreyas Iyer: ఆ మాటలు పట్టించుకోలేదు: శ్రేయస్‌

షార్ట్‌ పిచ్‌ బంతులు ఎదుర్కోలేడనే విమర్శలను పట్టించుకోకుండా తప్పులు దిద్దుకోవడంపైనే దృష్టి పెట్టి విజయవంతం అయ్యానని భారత యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు.

Updated : 24 Dec 2022 09:48 IST

మిర్పూర్‌: షార్ట్‌ పిచ్‌ బంతులు ఎదుర్కోలేడనే విమర్శలను పట్టించుకోకుండా తప్పులు దిద్దుకోవడంపైనే దృష్టి పెట్టి విజయవంతం అయ్యానని భారత యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన నేపథ్యంలో అతడిలా పేర్కొన్నాడు. ‘‘షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడంలో నా తడబాటును గుర్తించి బౌలర్లు అదే ఆయుధంతో లక్ష్యంగా చేసుకునేవాళ్లు. బయట మాటలను పట్టించుకోలేదు. షార్ట్‌ బంతులను వదిలేసినా లేదా బంతిని కిందకి అణిచి ఆడినా ఇబ్బంది ఉండదని అర్థం అయింది. బంగ్లాదేశ్‌పై ఇలాగే ఆడా. స్వీప్‌ షాట్‌ను కూడా సమర్థంగా ఉపయోగించుకున్నా. అదే షాట్‌కు ఔటైనందుకు బాధగా లేదు. ఆ బంతిని సరిగా ఆడలేకపోయా అంతే. కానీ సెంచరీ అందుకోలేకపోవడం నిరాశ కలిగించింది’’ అని శ్రేయస్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని