SRH : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సైమన్‌ కటిచ్‌ గుడ్‌బై!

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...

Published : 18 Feb 2022 17:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకు షాక్ తగిలింది. సహాయక కోచ్‌ సైమన్‌ కటిచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుకు వీడ్కోలు చెబుతున్నట్లు సమాచారం. మెగా వేలం నిర్వహణకు ముందు అనుకున్న ప్రణాళికలను అమలు చేయడంలో ఫ్రాంఛైజీ విస్మరించిందని, జట్టు నిర్వహణపై భిన్నభిప్రాయాలు రావడంతో కటిచ్‌ నిర్ణయం తీసుకున్నట్లు ‘ది ఆస్ట్రేలియన్’ నివేదిక తెలియజేస్తోంది. 2019లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు సైమన్‌ ప్రధాన కోచ్‌గా పని చేశాడు. కోచ్‌లుగా పని చేసిన ట్రావెర్ బైలిస్‌, బ్రాడ్ హడిన్ వంటి మాజీలు కూడా గత సీజన్‌ నుంచి పదవుల నుంచి తప్పుకున్నారు. 

దీంతో టామ్‌ మూడీని ఎస్‌ఆర్‌హెచ్‌ మళ్లీ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. సైమన్‌ కటిచ్‌ను టామ్‌ మూడీనే సహాయక కోచ్‌గా తీసుకొచ్చాడు. ఇప్పుడు సైమన్‌ కూడా జట్టుకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, తుది జట్టులోనూ స్థానం కల్పించకపోవడం వంటి చర్యలతో ఎస్‌ఆర్‌హెచ్‌ అప్రతిష్ఠపాలైంది. మెగా వేలానికి ముందు వార్నర్‌ను కాదని.. కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ను రిటెయిన్‌ చేసుకుంది. మరోవైపు వేలంలోనూ స్టార్‌ బ్యాటర్లను దక్కించుకోవడంలో వెనకడుగు వేసింది. అయితే ఆల్‌రౌండర్లు, బౌలర్లపై భారీగా వెచ్చించి కొనుగోలు చేసుకుంది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు : కేన్‌ విలియమ్సన్‌, ఉమ్రాన్‌ మాలిక్, అబ్దుల్ సమద్, వాషిగ్టన్‌ సుందర్, నికోలస్‌ పూరన్, టి. నటరాజన్, భువనేశ్వర్‌ కుమార్‌, ప్రియమ్‌ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ, కార్తిక్ త్యాగి, శ్రేయస్‌ గోపాల్, జగదీశ సుచిత్, మార్‌క్రమ్‌, మార్కో జాన్‌సెన్, రొమారియో షెఫెర్డ్‌, సీన్‌ అబాట్, సామర్థ్, శశాంక్ సింగ్, సౌరభ్‌ దూబే, విష్ణు వినోద్, గ్లెన్‌ ఫిలిప్స్‌, ఫాజల్‌హక్‌ ఫరూకి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు