MS Dhoni: చూస్తుండండి.. మజా వస్తుంది!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను అత్యంత విజయవంతం చేసిన సారథి ఎంఎస్‌ ధోనీ. అతడికి తోడుగా జట్టు నాయకత్వ...

Published : 20 May 2021 01:17 IST

రైనాను తీసుకోగానే మహీ అన్న మాటలివి

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను అత్యంత విజయవంతం చేసిన సారథి ఎంఎస్‌ ధోనీ. అతడికి తోడుగా జట్టు నాయకత్వ బాధ్యతలను పంచుకొన్నాడు సురేశ్ రైనా. వీరిద్దరే ఆ జట్టుకు మూల స్తంభాలు. దాదాపుగా అన్నదమ్ముల్లా ఉండే వీరిని తమిళ అభిమానులు పెద్ద తలా, చిన్న తలా అని పిలుచుకుంటారు.

ఐపీఎల్‌ తొలి వేలంలో తనను ఎంపిక చేయగానే ధోనీ ఏమన్నాడో రైనా చెప్పాడు. ఎప్పటిలాగే పొడిపొడిగా ‘చూస్తుండండి.. మజా వస్తుంది’ (మజా ఆయేంగా దేఖ్‌) అని అన్నాడట. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘బిలీవ్‌’లో రైనా వివరించాడు. తొలి సీజన్‌ నుంచి ఈ ఎడమచేతి వాటం ఆటగాడు సీఎస్‌కే పరుగుల రారాజుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి సీజన్‌లో కనీసం 350 పరుగులైనా చేసేవాడు. 2020లో మాత్రం వ్యక్తిగత కారణాలతో దుబాయ్‌కు వచ్చి వెనుదిరిగాడు. 2021లో పునరాగమనం చేశాడు.

‘ఐపీఎల్‌ వేలం జరుగుతోంది. దేశంలోని మిగతా క్రికెటర్ల మాదిరిగానే నేను ఏ జట్టుకు ఆడతానో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చెన్నై సూపర్‌కింగ్స్‌ అని తెలియగానే ఎంతో సంతోషించా. ఎందుకంటే మహీభాయ్‌, నేను ఒకే జట్టుకు ఆడతాం. వేలంలో నన్ను తీసుకోగానే మహీభాయ్‌ ఏమన్నాడో నేను విన్నా. చూస్తుండండి.. మజా వస్తుందని అతను అన్నాడు. అతడిపై అంచనాలు ఎక్కువ. మాథ్యూ హెడేన్‌, ముత్తయ్య మురళీధరన్‌, స్టీఫెన్‌ ప్లెమింగ్‌ వంటి క్రికెటర్లూ జట్టులో ఉండటంతో నాకు ఆత్రుత కలిగింది. చెన్నైకి ఆడటం వల్ల మహీభాయ్‌తో నా అనుబంధం పెరిగింది’ అని  పుస్తకంలో రైనా వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని