SKY: సూర్యకుమార్‌ నాకు పెద్దన్నయ్య‌.. ఎప్పుడూ మద్దతుగా నిలుస్తాడు: ములానీ

ఐపీఎల్‌ మినీ వేలంలో ములానీని రూ.20 లక్షలకు ముంబయి కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో పరుగులను నియంత్రించడంలో ములానీ సమర్థుడు. అలాగే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు.

Published : 26 Dec 2022 20:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (ipl 2023 auction) మినీ వేలంలో దేశవాళీ క్రికెటర్లు భలే ఛాన్స్‌ కొట్టేశారు. తమ కనీస ధరను దక్కించుకొని అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్ శామ్స్‌ ములానీని ముంబయి సొంతం చేసుకొంది. దేశవాళీ క్రికెట్‌లో బ్యాటర్ల పరుగులను నియంత్రించడంలో ములానీ సమర్థుడు. అలాగే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఐపీఎల్‌ మినీ వేలంలో ములానీని రూ.20 లక్షలకు ముంబయి కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ములానీ మీడియాతో పంచుకున్నాడు. సూర్యకుమార్‌ తనకు అన్నయ్య లాంటి వాడని వెల్లడించాడు.

‘‘వేలంలో ముంబయి జట్టులో చోటు దక్కిన రెండు నిమిషాలకే సూర్య అన్నయ్య ఫోన్‌ చేసి అభినందనలు తెలిపాడు. ముంబయి జట్టులోకి ప్రవేశంచినప్పటి నుంచి అతడు నా ప్రయాణాన్ని చూస్తున్నాడు. నాకు ఎప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంటాడు. అతడు నాకు అన్నయ్య లాంటి వాడు. తన నుంచి నాకు ఎప్పుడూ మంచి సహకారం లభిస్తుంది’’ అని ములానీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు