ICC Rankings: కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్యకుమార్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను నమోదు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెరీర్‌లో ఉత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 47 పరుగులు బాది 910 రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్య.. రెండో టీ20లో కఠినమైన పిచ్‌పై 26 పరుగులు చేసి రెండు పాయింట్లు కోల్పోయాడు. ప్రస్తుతం 908 రేటింగ్ పాయింట్లతో సూర్యకుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును అధిగమించడానికి కొద్ది దూరంలో నిలిచాడు SKY.
2020లో డేవిడ్ మలన్ 915 రేటింగ్ పాయింట్లను అందుకుని అత్యధిక రేటింగ్ పాయింట్లు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. గతేడాది టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటతీరును కనబరిచి 2022 సంవత్సరానికిగాను ఐసీసీ ఉత్తమ టీ20 క్రికెటర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు, ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు గణనీయమైన స్థానాలను మెరుగుపర్చుకున్నారు. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకోగా.. డారిల్ మిచెల్ తొమ్మిది స్థానాలు మెరుగుపడి 29వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో మిచెల్ శాంటర్న్ రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలవగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో ఐదు స్థానాలు మెరుగపడి 23వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ (698), ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ (252) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Injury: గాయం ‘స్మార్ట్’గా మానిపోతుంది
-
Politics News
Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
-
World News
Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా.. ’: బైడెన్ వీడియో వైరల్
-
India News
Hand Writing: పెన్ను పెడితే.. పేపర్‌పై ముత్యాలే
-
Crime News
Hyderabad: కుమారుల అనారోగ్యంపై మనస్తాపం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
-
India News
పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు