IND vs SA : దక్షిణాఫ్రికాపై షమి జోరు.. మరో 5 వికెట్లు సాధిస్తే..

దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి మరో 5 వికెట్లు సాధిస్తే.. సఫారీ జట్టుపై ఒకేసారి రెండు రికార్డులు నెలకొల్పుతాడు...

Updated : 11 Jan 2022 13:06 IST

ఇంటర్నెట్‌డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి మరో 5 వికెట్లు సాధిస్తే.. సఫారీ జట్టుపై అరుదైన రికార్డు నెలకొల్పుతాడు. ఆ టీమ్‌పై టెస్టుల్లో 50 కన్నా ఎక్కువ వికెట్లు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో పేసర్‌గా నిలవడమే కాకుండా.. ఓవరాల్‌గా ఐదో బౌలర్‌గానూ ఘనత సాధిస్తాడు. ఈ జాబితాలో స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే అత్యధికంగా 84 వికెట్లు సాధించి అగ్రస్థానంలో ఉండగా.. శ్రీనాథ్‌ 64 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆపై హర్భజన్‌ 60, రవిచంద్రన్‌ అశ్విన్‌ 56 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మరోవైపు షమి టెస్టుల్లో దక్షిణాఫ్రికాపైనే అత్యధిక వికెట్లు తీయడం విశేషం. ఇప్పటివరకు ఆ జట్టుపై ఆడిన 10 మ్యాచ్‌ల్లో షమి 20.55 సగటుతో మొత్తం 45 వికెట్లు తీశాడు. అందులో మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉండగా.. టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా ఇప్పటికే సిరీస్‌లో చెరో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమానంగా నిలిచాయి. ఇరు జట్లూ ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు కోహ్లీసేన ఈ టెస్టులో విజయం సాధించి తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక సిరీస్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. దీంతో మూడో టెస్టుపై ఆసక్తి మరింత పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని