IND vs ZIM: సూర్యకుమార్‌ @ 1000 పరుగులు.. ఆ రికార్డు అందుకున్న తొలి క్రికెటర్‌

టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా రెండు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ అదరగొడుతున్నాడు.

Updated : 06 Nov 2022 19:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా రెండు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ టీ20 ప్రపంచకప్‌లో రెండు అర్ధ సెంచరీలు బాదిన సూర్య.. ఇవాళ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ  (61; 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2022లో టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నతొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం  సూర్యకుమార్‌ (1026) పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. మహ్మద్‌ రిజ్వాన్‌ (924), విరాట్‌ కోహ్లీ (731) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వేగవంతమైన అర్ధశతకం

జింబాబ్వేపై 23 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన సూర్యకుమార్‌.. టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన హాఫ్‌ సెంచరీ బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్‌ సింగ్‌ (12 బంతుల్లో),  కేఎల్ రాహుల్‌ (18 బంతుల్లో), యువరాజ్‌ సింగ్‌ (20 బంతుల్లో) సూర్యకుమార్‌ కంటే ముందున్నారు.

అదిరిపోయే స్ట్రైక్‌ రేట్‌

టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో 100 కంటే బంతులు ఎదుర్కొని అత్యధిక స్ట్రైక్‌రేట్‌ (193.96) కలిగి ఉన్న ఆటగాడిగానూ సూర్యకుమార్‌ రికార్డు సృష్టించాడు.  ఈ టీ20 ప్రపంచకప్‌లో సూర్య కుమార్‌.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులే చేసి నిరాశపర్చగా.. నెదర్లాండ్స్‌పై  (51;25 బంతుల్లో), సౌతాఫ్రికాపై (68), బంగ్లాదేశ్‌పై  (30 పరుగులు 16 బంతుల్లో) రాణించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు