Cricket News: అంపైర్‌ ఎందుకు చెప్తాడు?: గావస్కర్‌

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు భారత తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ బ్యాటింగ్‌ సమయంలో క్రీజు బయట నిలబడొద్దని అంపైర్‌ ఎందుకు చెప్తాడని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిబంధనల్లో అలాంటిదేమీ లేదని ...

Updated : 28 Aug 2021 07:02 IST

లీడ్స్‌: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు భారత తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ బ్యాటింగ్‌ సమయంలో క్రీజు బయట నిలబడొద్దని అంపైర్‌ ఎందుకు చెప్తాడని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిబంధనల్లో అలాంటిదేమీ లేదని అతను చెప్పాడు. తొలి రోజు ఆట తర్వాత పంత్‌ మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్‌ చేసేటపుడు క్రీజు బయట నిలబడితే నా ముందు కాలు డేంజర్‌ ఏరియాలోకి వచ్చింది. అందుకే అలా నిలబడవద్దని అంపైర్‌ చెప్పాడు. కాబట్టి నా స్టాన్స్‌ను మార్చుకున్నా. బ్యాట్స్‌మెన్‌ అందరూ అలాగే చేస్తారు, అంపైర్లు అలాగే చెప్తారు కాబట్టి ఓ క్రికెటర్‌గా దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు’’ అని చెప్పాడు. మూడో రోజు ఆటలో వ్యాఖ్యానం సందర్భంగా దీనిపై స్పందించిన గావస్కర్‌.. ‘‘ఒకవేళ పంత్‌ చెప్పింది నిజమైతే తన స్టాన్స్‌ను మార్చుకోమని అంపైర్లు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్యాట్స్‌మెన్‌ ఎక్కడైనా నిలబడవచ్చు. పిచ్‌ మధ్యలో ఉండి కూడా బ్యాటింగ్‌ చేయొచ్చు. స్పిన్నర్ల బౌలింగ్‌లో ముందుకు వెళ్లి ఆడొచ్చు’’ అని తెలిపాడు. సహ వ్యాఖ్యాత, మాజీ భారత క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. అంపైర్లు పంత్‌కు అలా చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నాడు. పంత్‌ పట్ల ఇద్దరు ఇంగ్లాండ్‌ అంపైర్లు అలా వ్యవహరించడంతో మరోసారి తటస్థ అంపైర్ల విషయంపై చర్చ మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని