Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్‌

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ కీలక సమయంలో అర్ధ శతకం సాధించాడు. కొంతకాలంగా వన్డేల్లో తన స్థాయి తగ్గ ప్రదర్శన చేయకపోవడంపై మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ మాట్లాడాడు.  

Updated : 23 Sep 2023 19:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ ముంగిట టీమ్‌ఇండియా మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్  (Suryakumar Yadav) ఫామ్‌ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో అతడు కీలక సమయంలో అర్ధ శతకం సాధించాడు. దాదాపు 19 నెలల తర్వాత వన్డేల్లో హాఫ్ సెంచరీ కొట్టడం గమనార్హం. కొంతకాలంగా వన్డేల్లో తన స్థాయి తగ్గ ప్రదర్శన చేయకపోవడంపై మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ మాట్లాడాడు.  

‘‘నేను వన్డే ఫార్మాట్‌లో ఆడటం ప్రారంభించినప్పుడు వీలైనంత వరకు ఆట చివరిదాకా క్రీజులో ఉండి ముగించాలని కలలు కన్నా. ఈ రోజు నేను అలా చేయలేకపోయాను. కానీ, నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా. ఇన్నాళ్లు ఏం జరుగుతుందో తెలియక తికమకపడ్డా. బంతి రంగు ఒకేలా ఉంది. జట్లు ఒకేలా ఉన్నాయి. బౌలర్లు ఒకేలా ఉన్నారు. నేనే కొంచెం తొందరపడుతున్నానని గ్రహించా. ఇంకొంచెం సమయం తీసుకుందామని అనుకున్నా. ప్రశాంతంగా ఉంటూ ఆటను అర్థం చేసుకుంటూ ఆడేందుకు ప్రయత్నించా’’ అని సూర్యకుమార్ వివరించాడు.

శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..

ఆటతో భయం పుట్టిస్తాడు: సెహ్వాగ్

సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంసలు కురిపించాడు. సూర్య రాణించడం ఆనందంగా ఉందని, అతడు టీమ్‌ఇండియాకు కచ్చితంగా కీలక ఆటగాడని పేర్కొన్నాడు. చాలా మందికి ఆటగాళ్లకు సూర్యశైలిలో ఆడగల సామర్థ్యం లేదని, అతడు తన ఆటతో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు భయం పుట్టిస్తాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని