hardik pandya: మా అబ్బాయిని మిస్సవుతున్నా: హార్దిక్‌ వీడియో వైరల్‌

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు చేసిన ట్విటర్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Published : 12 Oct 2022 01:11 IST

దిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో ఉంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న రోహిత్‌ సేన ఆ ఉత్సాహంతో ఈ టోర్నీ కోసం మరింత శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన 29వ పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు హార్దిక్‌ చేసిన ట్విటర్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. 

ఈ ప్రత్యేకమైన రోజున తన కుమారుడితో సమయం గడపలేకపోవడం బాధగా ఉందంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. ‘‘నా పుట్టిన రోజున మా అబ్బాయిని చాలా మిస్సవుతున్నా.. నేను అందుకున్న గొప్ప బహుమతి తనే’’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.  తన కుమారుడితో కలిసి ఇంట్లో సరదాగా గడుపుతున్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రపంచ టోర్నీకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రోహిత్‌ సేన ప్రాక్టీస్‌ మ్యాచుల్లో చెమటోడుస్తోంది.  అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు