అది నా అదృష్టమే: కుంబ్లే

దిగ్గజ క్రికెటర్లు తన జట్టులో ఉండటం అదృష్టమని టీమ్‌ఇండియా మాజీ సారథి, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే అన్నారు. సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌కు బౌలింగ్‌ చేయాల్సి....

Published : 24 Jul 2020 02:14 IST

సచిన్‌, దాదా, ద్రవిడ్‌, వీరూ, లక్ష్మణ్‌కు బౌలింగ్‌‌ గురించి ఆలోచించాల్సి వచ్చేది

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: దిగ్గజ క్రికెటర్లు తన జట్టులో ఉండటం అదృష్టమని టీమ్‌ఇండియా మాజీ సారథి, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే అన్నారు. సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌కు బౌలింగ్‌ చేయాల్సి రాకపోవడం సంతోషకరమని తెలిపారు. లేదంటే వారికి బంతులు విసరడం కష్టమని పేర్కొన్నారు. జింబాబ్వే మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత పొమి ఎంబగ్వాతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన మాట్లాడారు.

‘అదృష్టవశాత్తూ వారంతా నా జట్టులోని సభ్యులు. తెందూల్కర్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, గంగూలీ, సెహ్వాగ్‌ నా జట్టులో ఉండటం సంతోషకరం. అయితే వీరికి నెట్స్‌లో మాత్రమే బంతులు విసిరాను. లేదంటే మరునాడు ఉదయం మ్యాచులో వీరికి బౌలింగ్‌ ఎలా చేయాలని ముందురోజు రాత్రి ఆలోచిస్తూ గడపాల్సి వచ్చేది’ అని కుంబ్లే అన్నారు. టీమ్‌ఇండియా కోచ్‌గా సమయాన్ని తాను బాగా ఆస్వాదించానని ఇదే చర్చలో ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. కోహ్లీతో అభిప్రాయ భేదాలు రావడంతో ఏడాది కాలానికే పదవి నుంచి జంబో హుందాగా తప్పుకున్నారు. అయితే తన నిష్క్రమణ మరింత బాగుండాల్సిందని తెలిపారు.

వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారాకు బంతులేయడం కష్టమని కుంబ్లే అన్నారు. తాను ఎదుర్కొన్న కఠినమైన ప్రత్యర్థి అతడేనని చెప్పారు. విసిరే ప్రతి బంతిని ఆడేందుకు అతడి వద్ద నాలుగు షాట్లు ఉంటాయని పేర్కొన్నారు. అందుకే అతడికి బౌలింగ్‌ చేయడం ఎంతో కష్టమని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని