బీసీ కమిషన్‌ కాలపరిమితి మూడేళ్లు

రాష్ట్ర బీసీ కమిషన్‌ కాలపరిమితి 2021 సెప్టెంబరు 1 నుంచి మూడేళ్లుగా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ తొలి బీసీ కమిషన్‌లో సభ్యుడిగా

Updated : 09 Oct 2021 06:13 IST

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర బీసీ కమిషన్‌ కాలపరిమితి 2021 సెప్టెంబరు 1 నుంచి మూడేళ్లుగా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ తొలి బీసీ కమిషన్‌లో సభ్యుడిగా పనిచేసిన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహనరావును రెండో కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. ఛైర్మన్‌, సభ్యులు సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్‌, కె.కిషోర్‌గౌడ్‌లకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులతో సమానంగా వేతన భత్యాలు అందిస్తామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని