మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు

తెలంగాణలో మహిళల భద్రత సీఎం కేసీఆర్‌ ప్రధాన ఎజెండా అని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠచర్యలు తీసుకుంటోందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా షీ టీంల ఏర్పాటుతో

Published : 04 Dec 2021 05:24 IST

‘అభయ్‌కోట్‌’ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ కవిత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళల భద్రత సీఎం కేసీఆర్‌ ప్రధాన ఎజెండా అని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠచర్యలు తీసుకుంటోందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా షీ టీంల ఏర్పాటుతో పాటు అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులపై సర్కారు ఉక్కుపాదం మోపుతోందన్నారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్‌, శశాంక్‌రెడ్డి, దినేష్‌రెడ్డి దివ్యాంగ మహిళల రక్షణ కోసం రూపొందించిన ‘అభయ కోట్‌’ అనే ప్రత్యేక భద్రత జాకెట్‌ను శుక్రవారం కవిత హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఆవిష్కరించారు. ఈ కోట్‌ వినికిడి, మాట్లాడడంలో సమస్యలున్న మహిళల ఆత్మరక్షణకు, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆపద సమయాల్లో మహిళలు ఈ జాకెట్‌కు ఉండే ప్యానిక్‌ బటన్‌ నొక్కితే వెంటనే సైరన్‌ మోగుతుంది. ఎలక్టిక్ర్‌ షాక్‌ కూడా వస్తుంది. కుటుంబ సభ్యులకు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు లొకేషన్‌ మెసేజ్‌ వెళ్లేందుకూ ఇందులో ప్రత్యేక జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని అభయకోట్‌ రూపకర్తలు తెలిపారు. వారిని కవిత అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని