సౌర వెలుగులు...తొలగును పురుగులు!

పంటలపై తెగుళ్ల నివారణకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా వ్యవసాయ పరిశోధన స్థానం సరికొత్త ఆలోచన చేసింది. పురుగుల ఉద్ధృతిని తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా ఎకరం పత్తి పొలంలో సౌరదీపాలు ఏర్పాటుచేసింది. రాత్రి కాగానే ఆ దీపాలు వెలుగులు విరజిమ్ముతుంటాయి.

Published : 18 Jan 2022 04:24 IST

 

పొలంలో రాత్రివేళ వెలుగుతున్న రంగురంగుల సౌరదీపాలు

పంటలపై తెగుళ్ల నివారణకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా వ్యవసాయ పరిశోధన స్థానం సరికొత్త ఆలోచన చేసింది. పురుగుల ఉద్ధృతిని తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా ఎకరం పత్తి పొలంలో సౌరదీపాలు ఏర్పాటుచేసింది. రాత్రి కాగానే ఆ దీపాలు వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుగులకు ఆకర్షితమై వాటి చుట్టూ చేరే పురుగులు, దీపానికి తగిలించి ఉంచిన తొట్టె(ట్రే)లలో పడి చనిపోతాయి. కారణం.. నీటితో కలిపిన పురుగుమందును ఈ ట్రేలలో పోసివుంచటం.. ఇలా పంటను ఆశించేవి, రోజువారీగా నాశనమయ్యే పురుగుల సంఖ్యను లెక్కించడం వల్ల వాటి ఉద్ధృతిని అంచనా వేస్తున్నారు. దీపాలు అమర్చిన చేనుతో పాటు, ఇతర పొలాల్లో నష్టం ఎంతనేది పరిశీలిస్తున్నారు. వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పత్తి పొలాల్లో, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల్లోని పరిశోధన కేంద్రాల్లో వరి పంటపై ఈ పరిశోధన సాగుతోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని, ఈ విధానంతో తెగుళ్లు సమర్థంగా నివారణైతే రైతులంతా ఆచరించేలా చూస్తామని వ్యవసాయ పరిశోధన స్థానం సమన్వయకర్త డా.శ్రీధర్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.    
 

పత్తి చేనులో సౌరదీపం, ట్రేలో చనిపోయిన పురుగులు

- ఈనాడు, ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని