అనాథలుగా 236 మంది చిన్నారులు

తెలంగాణలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు 236 మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వీరి సంరక్షణ, మెరుగైన జీవన విధానం కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీఎంకేర్స్‌ పథకంలో ఈ పిల్లలందరి వివరాలు నమోదయ్యాయి.

Published : 18 Jan 2022 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు 236 మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వీరి సంరక్షణ, మెరుగైన జీవన విధానం కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీఎంకేర్స్‌ పథకంలో ఈ పిల్లలందరి వివరాలు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే 220 మందికి సహాయం చేసేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఆమోదం తెలిపింది. మరో 16 మంది పిల్లలకు త్వరలో ఆమోదం లభిస్తుందని సంక్షేమ వర్గాలు వెల్లడించాయి. ‘‘అనాథలుగా గుర్తించిన 236 మందిలో 225 మంది పిల్లలు బంధువుల సంరక్షణలోనే ఉంటున్నారు. 11 మంది పిల్లలు బంధువుల సంరక్షణలో ఉండబోమని చెప్పగా.. వారిని బాలల సంరక్షణ గృహాల్లో చేర్పించాం’’ అని శిశు సంక్షేమాధికారి తెలిపారు.
* పిల్లల సంరక్షణ కోసం ముందుకు వచ్చే దాతలు, కార్పొరేట్‌ సంస్థలను రాష్ట్ర శిశు సంక్షేమశాఖ ప్రోత్సహిస్తోంది. బాలల న్యాయ చట్టం కింద ఇప్పటికే రూ.9 కోట్లు సమకూరాయి. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఉపసంఘం ఇటీవల సమావేశమై అనాథలను ఆదుకునేందుకు సమగ్ర చట్టం చేయాలని అధికారులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు