
Published : 20 Jan 2022 05:38 IST
తలపై ఇదే ఉంటే.. నా బిడ్డ బతికెటోడు!
ఈ చిత్రంలో శిరస్త్రాణం పట్టుకొని ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి పేరు తేజావత్ హరి. ఆయనది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లోని సోమ్లానాయక్ తండా. హరి కుమారుడు సాయి(18) ఈనెల 8న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడు. శిరస్త్రాణం లేకపోవడంతోనే సాయి మృత్యువాత పడ్డాడని, ఆ పరిస్థితి మరొకరికి రాకూడదని హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు హరి ఇలా ప్రయత్నం చేశారు. మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో జరిగిన ఊరేగింపులో అంత బాధలోనూ ప్రజల్ని చైతన్యపరిచే హరి ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకొన్నారు.
- న్యూస్‌టుడే, పెనుబల్లి
Tags :