Go Digit: గో డిజిట్‌ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్‌ సైజ్‌ వివరాలు ఇవే..

Go Digit: ఆన్‌లైన్‌ వేదికగా ఇన్సూరెన్స్‌ సేవలందించే స్టార్టప్‌ సంస్థ గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది.

Updated : 10 May 2024 15:51 IST

Go Digit Insurance IPO | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌ వేదికగా ఇన్సూరెన్స్‌ సేవలందించే స్టార్టప్‌ సంస్థ గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ (Go Digit Insurance) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) మే 15న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 17న ముగియనుంది. ఐపీఓ ద్వారా గరిష్ఠ ధర వద్ద రూ.2,615 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. షేరు ధరల శ్రేణిని రూ.258-272గా నిర్ణయించారు. యాంకర్‌ ఇన్వెస్టర్లు ఒకరోజు ముందుగానే బిడ్లు దాఖలు చేయొచ్చు. 

ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ.1,125 కోట్ల తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద ప్రస్తుత షేర్ హోల్డర్ల వ్దద ఉన్న రూ.1,490 కోట్ల (5.47కోట్ల షేర్లు) విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓలో 75 శాతం షేర్లను అర్హత గల సంస్థాగత కొనుగోలుదారులకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, 10 శాతం రిటైల్‌లో కేటాయించారు. ఇన్వెస్టర్లు కనీసం 55 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 

పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?

ఈ కంపెనీలో విరుష్క దంపతులకు పెట్టుబడులు ఉన్నాయి. అయితే, ఈ ఐపీఓలో వారు తమ వాటాలను విక్రయించడం లేదు. మార్కెట్‌ నుంచి సమీకరించిన నిధులను సంస్థ మూలధనాన్ని పెంచుకునేందుకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలను తీర్చుకునేందుకు వినియోగించనున్నట్లు తన ప్రాస్పెక్టస్‌లో కంపెనీ తెలిపింది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా, యాక్సిస్‌ క్యాపిటల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. తొలుత 2022 ఆగస్టులో ఈ కంపెనీ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేయగా.. పునః దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దాంతో 2023 ఏప్రిల్‌లో మరోసారి దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది మార్చిలో గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

కీలక తేదీలు

  • ఐపీఓ తేదీలు: మే15- 17
  • ధరల శ్రేణి: రూ.258-272
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 55 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,400
  • అలాట్‌మెంట్ తేదీ: మే 21
  • రిఫండ్‌ తేదీ: మే 22
  • లిస్టింగ్‌ తేదీ: మే23
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని