icon icon icon
icon icon icon

Chandrababu: వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫొటో ఎందుకు?: చంద్రబాబు

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చాలా దుర్మార్గమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామన్నారు.

Updated : 10 May 2024 15:32 IST

ఏలూరు, ఉండి: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చాలా దుర్మార్గమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్‌ సిద్ధమయ్యారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజును హింసించారన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు మాట్లాడారు. 

‘‘రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడీదారు, సైకో. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు జగన్‌. మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఇసుకను ఉచితంగా ఇచ్చాను. ప్రజల భూములు కొట్టేయడానికి జగన్‌ సిద్ధమయ్యారు. మీ ఆస్తులపై కన్నేశారు. వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫొటో ఎందుకు? దీనికి మీరు అంగీకరిస్తారా? ఆమోదయోగ్యమేనా? భూమి మీది.. దానిపై పెత్తనం జలగ జగన్‌ మోహన్‌రెడ్డిది. అధికారంలోకి రాగానే రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలిస్తాం. ఈ ఎన్నికల్లో ఫ్యానుకు, వైకాపాకు ఉరేయాలి. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయని జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదు’’ అని చంద్రబాబు అన్నారు.

తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలవ్వాలి

పోలింగ్‌ రోజున వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏలూరులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగిస్తూ... మీ భూమిపై జగన్‌ పెత్తనమేంటని నిలదీశారు. వైకాపా ప్రభుత్వ అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలని కోరారు. ‘‘ రాష్ట్ర భవిష్యత్‌ మార్చుకునేందుకు ఇంకా 3 రోజులే ఉంది. అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. గెలుపే ధ్యేయంగా కూటమి కార్యకర్తలు పని చేయాలి. సైకోను సాగనంపడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రజల జీవితాలు మారాలన్నా, రైతులకు సాగు నీరు అందాలన్నా, గిట్టుబాటు ధర రావాలన్నా, పిల్లల భవిష్యత్‌ బాగుండాలన్నా, రాష్ట్రం నుంచి ‘జె బ్రాండ్‌’లు పూర్తిగా పోవాలన్నా, కరెంట్‌ ఛార్జీల మోత తప్పాలన్నా అందరూ ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img