ఓఎంసీ కేసు పిటిషన్‌పై విచారణ నిలిపివేయండి
ఓఎంసీ కేసులో దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముందుకెళ్లకుండా చూడడానికి నిందితురాలైన ఏపీ మాజీ అధికారి వై.శ్రీలక్ష్మి సోమవారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలంటూ
హైకోర్టులో వై.శ్రీలక్ష్మి మరో పిటిషన్
ఈనాడు, హైదరాబాద్: ఓఎంసీ కేసులో దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముందుకెళ్లకుండా చూడడానికి నిందితురాలైన ఏపీ మాజీ అధికారి వై.శ్రీలక్ష్మి సోమవారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసిన నేపథ్యంలో సీబీఐ కోర్టులో పిటిషన్‌పై విచారణ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని శ్రీలక్ష్మి పిటిషన్లో కోరారు. లేకపోతే తనకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పలు అవకాశాల అనంతరం వాదనలు వినిపించకపోవడంతో పిటిషన్‌పై వాదనలు ముగిసినట్లుగా సీబీఐ కోర్టు నమోదు చేస్తూ అభియోగాల నమోదు కోసం వాయిదా వేసింది. అయితే తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గత డిసెంబరు 9న వాదనలు ముగిసినందున, తీర్పు వెలువరించాల్సి ఉందని... అందువల్ల గతంలో వాదనలు ముగిశాయంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుమతిస్తూ సీబీఐ కోర్టు విచారణను వాయిదావేసింది. డిశ్ఛార్జి పిటిషన్లలో నిందితులందరూ వాదనలు వినిపించాక సీబీఐ వాదనలు వినిపించాల్సి ఉందని, అందువల్ల పిటిషనర్‌కు వాటిల్లే నష్టం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి పిటిషన్‌పై మంగళవారం వాదనలు కొనసాగాల్సి ఉండగా సోమవారం ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!