ఓఎంసీ కేసు పిటిషన్‌పై విచారణ నిలిపివేయండి

ఓఎంసీ కేసులో దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముందుకెళ్లకుండా చూడడానికి నిందితురాలైన ఏపీ మాజీ అధికారి వై.శ్రీలక్ష్మి సోమవారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలంటూ

Published : 25 Jan 2022 05:09 IST

హైకోర్టులో వై.శ్రీలక్ష్మి మరో పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముందుకెళ్లకుండా చూడడానికి నిందితురాలైన ఏపీ మాజీ అధికారి వై.శ్రీలక్ష్మి సోమవారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసిన నేపథ్యంలో సీబీఐ కోర్టులో పిటిషన్‌పై విచారణ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని శ్రీలక్ష్మి పిటిషన్‌లో కోరారు. లేకపోతే తనకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పలు అవకాశాల అనంతరం వాదనలు వినిపించకపోవడంతో పిటిషన్‌పై వాదనలు ముగిసినట్లుగా సీబీఐ కోర్టు నమోదు చేస్తూ అభియోగాల నమోదు కోసం వాయిదా వేసింది. అయితే తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గత డిసెంబరు 9న వాదనలు ముగిసినందున, తీర్పు వెలువరించాల్సి ఉందని... అందువల్ల గతంలో వాదనలు ముగిశాయంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి అనుమతిస్తూ సీబీఐ కోర్టు విచారణను వాయిదావేసింది. డిశ్ఛార్జి పిటిషన్‌లలో నిందితులందరూ వాదనలు వినిపించాక సీబీఐ వాదనలు వినిపించాల్సి ఉందని, అందువల్ల పిటిషనర్‌కు వాటిల్లే నష్టం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి  పిటిషన్‌పై మంగళవారం వాదనలు కొనసాగాల్సి ఉండగా సోమవారం ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని