‘ఎన్టీఆర్‌ జిల్లా’ను స్వాగతిస్తున్నాం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్‌ జిల్లాని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తనయుడు రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది తెలుగువాళ్లు గర్వపడే నిర్ణయమని ఆయన సంతోషం వెలిబుచ్చారు.

Published : 28 Jan 2022 04:42 IST

నందమూరి రామకృష్ణ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్‌ జిల్లాని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తనయుడు రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది తెలుగువాళ్లు గర్వపడే నిర్ణయమని ఆయన సంతోషం వెలిబుచ్చారు.

* జిల్లా కేంద్రాల విషయంలో రాజకీయం చేయొద్దు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు.

* తెలుగు ప్రజల అభిమతం, ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంపై దర్శకనిర్మాత వై.వి.ఎస్‌.చౌదరి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణలో కూడా ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటుపై కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని