ఛాటింగ్‌ టైప్‌రైటర్‌!

టైప్‌రైటర్‌తో ఏం చేస్తాం? టైపింగ్‌ చేస్తాం. ఇంకేం చేస్తాం? మామూలు టైప్‌రైటర్‌తో ఎవరైనా ఇదే చేస్తారు. కానీ అర్వింద్‌ సంజీవ్‌ అనే ఇంజినీర్‌ రూపొందించిన టైప్‌రైటర్‌తో ఛాటింగూ చేయొచ్చు.

Published : 08 Feb 2023 00:09 IST

టైప్‌రైటర్‌తో ఏం చేస్తాం? టైపింగ్‌ చేస్తాం. ఇంకేం చేస్తాం? మామూలు టైప్‌రైటర్‌తో ఎవరైనా ఇదే చేస్తారు. కానీ అర్వింద్‌ సంజీవ్‌ అనే ఇంజినీర్‌ రూపొందించిన టైప్‌రైటర్‌తో ఛాటింగూ చేయొచ్చు. నమ్మబుద్ధి కావటం లేదా? ఇది కృత్రిమ మేధతో పనిచేస్తుంది మరి. దీని పేరు ఘోస్ట్‌రైటర్‌. ఛాట్‌ జీపీటీ మాదిరిగా ఇదీ టైప్‌ చేసేవారితో ఛాట్‌ చేస్తుంది. ఉదాహరణకు- నువ్వెవరు? అని ఇంగ్లిష్‌లో టైప్‌ చేశారనుకోండి. మన ప్రమేయం ఏమీ లేకుండానే ‘నేను ఘోస్ట్‌రైటర్‌ని’ అని మొదలెట్టి తన కథంగా టైప్‌ చేసి చూపిస్తుంది. బ్రదర్‌ ఏఎక్స్‌-325 అనే 90ల నాటి ఎలక్ట్రిక్‌ టైప్‌రైటర్‌తో సంజీవ్‌ దీన్ని సృష్టించారు. రివర్స్‌-ఇంజినీరింగ్‌ పద్ధతితో కూడిన కీబోర్డు సిగ్నల్స్‌కు ఆర్‌డ్యూనో అనే మైక్రోకంట్రోలర్‌ను జతచేశారు. ఇది జీపీటీ-3 ఏపీఐ పరిజ్ఞానం గల ‘రాస్ప్‌బెర్రీ పై’కి సంకేతాలను చేరవేస్తుంది. దీంతో ఘోస్ట్‌రైటర్‌ తనకు తానే కాగితం మీద అడిగిన విషయాన్ని టైప్‌ చేసి పెడుతుంది. జీపీటీ-3 ఛాట్‌బాక్స్‌ మాదిరిగా పనిచేస్తుంది. రాయటం దగ్గర్నుంచి కవిత్వాన్ని అల్లటం వరకూ రకరకాలుగా సాయం చేస్తుంది. ఘోస్ట్‌రైటర్‌ను ట్విటర్‌ ద్వారా పరిచయం చేస్తూ సంజీవ్‌ తన ఉద్దేశాన్నీ వెల్లడించారు. మానవులు, కృత్రిమ మేధ మధ్య సంబంధాల్లో ప్రభావవంతమైన ముద్రను వేయాలన్నది ఆయన ఆశయం. మన దృష్టిని డిజిటల్‌ పరధ్యానాల నుంచి మళ్లించి కాగితం, సిరా ద్వారా భావోద్వేగ ప్రయాణాలకు తీసుకెళ్లాలనీ భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని