Google Chomre: క్రోమ్‌ వాడుతున్నారా.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

క్రోమ్‌ బ్రౌజర్‌లోని లోపాల కారణంగా హ్యాకర్లు సులువుగా యూజర్ల కంప్యూటర్‌ నుంచి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది.

Published : 31 Jan 2023 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెబ్‌ విహారం అనగానే ఎక్కువ మంది మొదటి ఎంపిక గూగుల్ క్రోమ్‌ (Google  Chrome). భద్రత, ఫీచర్ల పరంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను యూజర్లను అందిస్తుండటంతో బ్రౌజింగ్‌ కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా బ్రౌజింగ్‌ చేసేప్పుడు యూజర్‌ సమాచారం ఇతరులు యాక్సెస్‌ చేయకుండా క్రోమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోమని గూగుల్ (Google) సూచిస్తుంది. కానీ, కొంత మంది యూజర్లు ఇప్పటికీ పాత వెర్షన్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటారు. తాజాగా గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో కొన్ని లోపాలున్నాయని (Vulnerabilities).. దాని వల్ల యూజర్స్‌ కంప్యూటర్లను హ్యాకర్స్‌ సులువుగా యాక్సెస్ చేసే అవకాశం ఉందని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) వెల్లడించింది. 

‘‘క్రోమ్‌ బ్రౌజర్‌లో కొన్ని లోపాయిన్నాయి.  వెబ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, వెబ్‌ ఆర్‌టీసీ అండ్ గెస్ట్ వ్యూ, టైప్‌ కన్ఫ్యూజన్‌ ఎర్రర్ వంటి పేర్లతో ఈ లోపాలను గుర్తించాం. వీటివల్ల హ్యాకర్లు సులువుగా కంప్యూటర్‌/పీసీలను రిమోట్‌ యాక్సెస్ చేసి, తాము ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌ పేజ్‌పై యూజర్లు క్లిక్‌ చేసేలా చేస్తారు. తర్వాత సులువుగా మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టి తమకు కావాల్సిన సమాచారాన్ని దొంగిలిస్తారు’’ అని సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది. క్రోమ్‌ 109.0.5414.119 (యాపిల్/లైనెక్స్‌), 109.0.514.119/120 (విండోస్‌) వెర్షన్‌ల కన్నా ముందు వెర్షన్‌ను బ్రౌజర్లను ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ బ్రౌజర్లను అప్‌డేట్‌ చేసుకోమని సూచించింది. మరి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో చూద్దాం. 

  • గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ ఓపెన్ చేయాలి. తర్వాత కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. 
  • సెట్టింగ్స్‌ ఓపెన్ చేస్తే ‘అబౌట్‌ క్రోమ్‌’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ బ్రౌజర్‌ అప్‌డేట్ కాకుంటే రీలాంచ్‌ చేసి అప్‌డేట్ చేయాలి.
  • ఒకవేళ మీ బ్రౌజర్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయితే మీకు లేటెస్ట్ వెర్షన్‌ను చూపిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు