ఐఓఎస్‌ 17.5 పబ్లిక్‌ బీటా వచ్చింది

ఐఓఎస్‌ 17.5 పబ్లిక్‌ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్‌ అకౌంట్‌ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్‌డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్‌ 17.5 స్టేబుల్‌ వర్షన్‌ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు.

Published : 17 Apr 2024 00:15 IST

ఓఎస్‌ 17.5 పబ్లిక్‌ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్‌ అకౌంట్‌ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్‌డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్‌ 17.5 స్టేబుల్‌ వర్షన్‌ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్లను వాడుకోవాలని భావించేవారికి పబ్లిక్‌ బీటా వర్షన్‌ మంచి అవకాశం. ఇందుకోసం ముందుగా యాపిల్‌ బీటా సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌కు సైన్‌ అప్‌ కావాలి. సఫారీ యాప్‌లో ఈ సైన్‌ అప్‌ పేజీ కనిపిస్తుంది. దీని ద్వారా యాపిల్‌ ఐడీకి సైన్‌ ఇన్‌ కావాలి. న్యాయ ఒప్పందాలకు అంగీకరించాలి. అనంతరం ఫోన్‌లో సెటింగ్స్‌ మెనూలోకి వెళ్లి జనరల్‌ విభాగం ద్వారా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను ఎంచుకోవాలి. ఇందులో బీటా అప్‌డేట్స్‌ మెనూ కనిపిస్తుంది. దీని మీద తాకి ఐఓఎస్‌ 17 పబ్లిక్‌ బీటా ఆప్షన్‌ను ఎంచుకొని, వెనక్కి రావాలి. అప్‌డేట్‌ నౌ మీద క్లిక్‌ చేసి వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఒకవేళ సమయం లేదంటే అప్‌డేట్‌ టునైట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఫోన్‌ను లాక్‌ చేసి, బ్యాటరీ నిండుకోకుండా చూసుకుంటే రాత్రిపూట ఇన్‌స్టాల్‌ అయిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు