వెబ్‌క్యామే స్కానర్‌

డెస్క్‌టాప్‌ ఉంది గానీ స్కానర్‌ లేదా? పోనీ వెబ్‌క్యామ్‌ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్‌ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్‌ ముందుకు తీసుకురావాలి.

Published : 24 Apr 2024 00:12 IST

డెస్క్‌టాప్‌ ఉంది గానీ స్కానర్‌ లేదా? పోనీ వెబ్‌క్యామ్‌ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్‌ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్‌ ముందుకు తీసుకురావాలి. ఎర్రగా కనిపించే ఫొటో గుర్తును నొక్కాలి. ఇది తెరకు కింద కుడి వైపున కనిపిస్తుంది. ఈ ఫైలును డెస్క్‌టాప్‌ మీదికి డ్రాగ్‌ చేస్తే అక్కడే ఉండిపోతుంది. పీసీలోనైతే- కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేసి డాక్యుమెంట్‌ను దానికి చూపించాలి. తెల్లగా కనిపించే కెమెరా గుర్తును క్లిక్‌ చేయాలి. ఫొటో తెర మీద పాపప్‌ అవుతుంది. పైన కుడి మూలన కనిపించే మూడు చుక్కల మీద క్లిక్‌ చేసి, ఓపెన్‌ ఫోల్డర్‌ను ఎంచుకోవాలి. అంతే.. స్కానింగ్‌ పూర్తవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని