స్మార్ట్‌ఫోనే రిమోట్‌

టెలివిజన్లలో ఇప్పుడు స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. టీవీ కార్యక్రమాలే కాకుండా ఓటీటీలు, యూట్యూబ్‌, అంతర్జాల వీక్షణ వంటి వాటికివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Published : 01 May 2024 00:03 IST

టెలివిజన్లలో ఇప్పుడు స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. టీవీ కార్యక్రమాలే కాకుండా ఓటీటీలు, యూట్యూబ్‌, అంతర్జాల వీక్షణ వంటి వాటికివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే చాలాసార్లు రిమోట్‌ కంట్రోల్‌ ఎక్కడ పెట్టామో మరచిపోతుంటాం. కొన్నిసార్లు ఎంత వెతికినా దొరకదు. మరి స్మార్ట్‌ఫోనే రిమోట్‌ కంట్రోల్‌గా ఉపయోగించుకుంటే? ఇందుకు గూగుల్‌ టీవీ యాప్‌ మంచి సాధనం. దీని సాయంతో ఆండ్రాయిడ్‌ టీవీలను నేరుగా స్మార్ట్‌ఫోన్‌ నుంచే కంట్రోల్‌ చేయొచ్చు.

ముందుగా స్మార్ట్‌ఫోన్‌, టీవీ.. రెండింటిలోనూ బ్లూటూత్‌ లేదా వై-ఫై నెట్‌వర్క్‌ను ఆన్‌ చేయాలి.

  • స్మార్ట్‌ఫోన్‌లో గూగూల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి గూగుల్‌ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  • గూగుల్‌ టీవీ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం తెర కింద కుడిమూలన ఉండే రిమోట్‌ బటన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • కనెక్ట్‌ కావటానికి దగ్గరలో ఉన్న పరికరాలను యాప్‌ స్కాన్‌ చేస్తుంది. జాబితాలో మన టీవీ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి.
  • అప్పుడు టీవీ తెర మీద ఒక కోడ్‌ ప్రత్యక్షమవుతుంది.
  • ఆ కోడ్‌ను యాప్‌లో ఎంటర్‌ చేసి, పెయిర్‌ బటన్‌ మీద తాకాలి. అప్పుడు టీవీ, స్మార్ట్‌ఫోన్‌ అనుసంధానమవుతాయి. ఫోన్‌తోనే ఛానెళ్లు మార్చుకోవటం, వాల్యూమ్‌ పెంచటం, తగ్గించటం, మ్యూట్‌, పాస్‌వర్డ్‌లు ఎంటర్‌ చేయటం, వాయిస్‌ సెర్చ్‌ వంటి పనులన్నీ చేసుకోవచ్చు.
  • ఎనీమోట్‌ స్మార్ట్‌ ఐఆర్‌ రిమోట్‌ వంటి టీవీ రిమోట్‌ యాప్‌లతోనూ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్‌ కంట్రోల్‌గా వాడుకోవచ్చు. ఇప్పుడు చాలా టీవీల కంపెనీలు తమ యాప్‌లనూ రిమోట్‌గా ఉపయోగించుకోవటానికి వీలు కల్పిస్తున్నాయి. అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌, గూగుల్‌ క్రోమ్‌కాస్ట్‌ అల్ట్రా వంటి స్ట్రీమింగ్‌ పరికరాలు గలవారు వాటిని స్మార్ట్‌ఫోన్లతోనూ కనెక్ట్‌ కావొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని