పీసీ షట్‌డౌన్‌ తేలికగా..

కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేయటం పెద్ద పనేమీ కాదు. కానీ కొన్నిసార్లు చాలా త్వరగా షట్‌డౌన్‌ చేయాల్సి రావొచ్చు. అప్పుడు కీబోర్డు మీటలు కలిపి నొక్కే పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం.

Published : 01 May 2024 00:02 IST

కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేయటం పెద్ద పనేమీ కాదు. కానీ కొన్నిసార్లు చాలా త్వరగా షట్‌డౌన్‌ చేయాల్సి రావొచ్చు. అప్పుడు కీబోర్డు మీటలు కలిపి నొక్కే పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం.

ఆల్ట్‌, ఎఫ్‌4 పద్ధతి

  • విండోస్‌ తెర మీద ఆల్ట్‌, ఎఫ్‌4 మీటలను కలిపి నొక్కాలి.
  • అప్పుడు షట్‌డౌన్‌ విండోస్‌ అనే డైలాగ్‌ బాక్స్‌ కనిపిస్తుంది.
  • డ్రాప్‌ డౌన్‌ మెనూలో షట్‌డౌన్‌ను ఎంచుకుంటే చాలు. పీసీ షట్‌డౌన్‌కిది చాలా తేలికైన పద్ధతి.

విన్‌, ఎక్స్‌ పద్ధతి

  •  విండోస్‌ తెర ఓపెన్‌ చేసి ఉన్నప్పుడు విండోస్‌, ఎక్స్‌ మీటలను కలిపి నొక్కాలి.
  •  అప్పుడు టాస్క్‌బార్‌ జాబితా పైకి లేస్తుంది. యు మీటను నొక్కితే షట్‌డౌన్‌ లేదా సైన్‌ అవుట్‌ విభాగం ఓపెన్‌ అవుతుంది.
  •  తిరిగి యు మీట నొక్కితే పీసీ లేదా ల్యాప్‌టాప్‌ షట్‌డౌన్‌ అవుతుంది.

షార్ట్‌కట్‌ మీటలు లేకుండా కూడా

విండోస్‌ పీసీ, ల్యాప్‌టాప్‌ను రన్‌ డైలాగ్‌ బాక్స్‌తోనూ తేలికగా షట్‌డౌన్‌ చేయొచ్చు.

  •  విండోస్‌, ఆర్‌ మీటలను నొక్కితే రన్‌ డైలాగ్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది.
  • ఇందులో  Shutdown –s  అని టైప్‌ చేసి, ఎంటర్‌ నొక్కితే సరి. నిమిషంలో కంప్యూటర్‌ షట్‌డౌన్‌ అవుతుందనే అలర్ట్‌ కనిపిస్తుంది. ఆ సమయానికి షట్‌డౌన్‌ అవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని