Old Phones: ఆనాటి పాత ఫోన్లే ముద్దు

ఇప్పుడు ఎవరిచేతిలో చూసినా అధునాతన టెక్‌ పరికరాలే కనిపిస్తున్నాయి కదా. అయితే స్మార్ట్‌ఫోన్లు అధికంగా వాడటం మానసిక సమస్యలు పెరగటానికి కారణమవుతోందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ తాజా నివేదిక పేర్కొంటోంది.

Updated : 12 Jun 2024 01:06 IST

ప్పుడు ఎవరిచేతిలో చూసినా అధునాతన టెక్‌ పరికరాలే కనిపిస్తున్నాయి కదా. అయితే స్మార్ట్‌ఫోన్లు అధికంగా వాడటం మానసిక సమస్యలు పెరగటానికి కారణమవుతోందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ తాజా నివేదిక పేర్కొంటోంది. అందుకే జడ్‌ యువత.. అంటే 1997-2008 మధ్య పుట్టినవారు తిరిగి ఆనాటి మామూలు ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతోంది. స్క్రీన్‌ను చూసే సమయాన్ని తగ్గించుకోవటానికి పాత ఫోన్ల వైపు దృష్టి సారిస్తున్నారని వివరిస్తోంది. వీటిల్లో కాల్స్, టెక్స్ట్‌ సందేశాలకు మాత్రమే అవకాశముంటుంది మరి. అతిగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడటం వల్ల ఒంటరితనం, వ్యసనం, ఆందోళన, కుంగుబాటు వంటి శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నట్టు ఇప్పటికే చాలా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి దుష్ప్రభావాలను తప్పించుకోవటానికే జడ్‌ తరం పాత ఫోన్ల వాడకానికి ఇష్టపడుతోంది. ఈ తరం యువత సగటున రోజుకు 7.2 గంటల సేపు స్క్రీన్‌ చూడటంలోనే నిమగ్నమవుతోంది. ఫలితంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. కుంగుబాటు ముప్పూ పెరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని