డెస్క్‌టాప్‌ డ్రైవ్‌!

వెబ్‌లో, మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ డ్రైవ్‌ వాడుతూనే ఉంటాం. మరి డెస్క్‌టాప్‌ వర్షన్‌ ఉపయోగించారా? ఇది గూగుల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ అయిన ఫైళ్లను విండోస్‌ లేదా మ్యాక్‌ఓఎస్‌ కంప్యూటర్‌లోని ఫైల్‌ సిస్టమ్‌తో సింక్‌ అయ్యేలా చేస్తుంది.

Published : 26 Oct 2022 00:15 IST

వెబ్‌లో, మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ డ్రైవ్‌ వాడుతూనే ఉంటాం. మరి డెస్క్‌టాప్‌ వర్షన్‌ ఉపయోగించారా? ఇది గూగుల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ అయిన ఫైళ్లను విండోస్‌ లేదా మ్యాక్‌ఓఎస్‌ కంప్యూటర్‌లోని ఫైల్‌ సిస్టమ్‌తో సింక్‌ అయ్యేలా చేస్తుంది. నాలుగేళ్ల తర్వాత డ్రైవ్‌ డెస్క్‌టాప్‌ సాఫ్ట్‌వేర్‌ను తిరిగి అప్‌డేట్‌ చేస్తున్నారు. ఇప్పుడిది డ్రైవ్‌ ఫర్‌ డెస్క్‌టాప్‌ రూపంలో కనిపిస్తుంది. డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌, ఐక్లౌడ్‌ వంటి క్లౌడ్‌ స్టోరేజీగా మాత్రమే కాదు.. పూర్తిస్థాయిలో ఫైల్‌ సింకింగ్‌ వ్యవస్థగానూ ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకునేటప్పుడు హార్డ్‌డ్రైవ్‌లోని డాక్యుమెంట్లు వెబ్‌లోనూ అందుబాటులో ఉంటాయి మరి. కంప్యూటర్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు లేదా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ స్లో అయినప్పుడు కూడా గూగుల్‌ డ్రైవ్‌ ఫోల్డర్‌లో స్టోర్‌ అయిన హెచ్‌డీ వీడియోలను చూసుకోవచ్చు. అప్‌లోడింగ్‌ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది. యూఎస్‌బీ వంటి ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్‌ల నుంచీ ఫైళ్లను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెండో కంప్యూటర్‌ కూడా ఉన్నవారికైతే మరింత బాగా ఉపయోగపడుతుంది. రెండు పీసీల మధ్య సింక్‌ అయిన ఫైళ్లు, ఫోల్డర్లలో అన్నింటిని గానీ కొన్నింటిని గానీ అలాగే ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని