యాపిల్‌ మ్యూజిక్‌తో పాట పాడుకుందాం

పాటలు పాడటమంటే ఎవరికి ఇష్టముండదు? అంతా కూనిరాగాలు తీసేవారే. ఇష్టమైన పాట టీవీలోనో, రేడియోలోనో వస్తుంటే గొంతు కలపకుండా ఉండలేరు.

Updated : 21 Dec 2022 05:11 IST

పాటలు పాడటమంటే ఎవరికి ఇష్టముండదు? అంతా కూనిరాగాలు తీసేవారే. ఇష్టమైన పాట టీవీలోనో, రేడియోలోనో వస్తుంటే గొంతు కలపకుండా ఉండలేరు. అందుకే గాయకుల గొంతు లేకుండా కేవలం నేపథ్య సంగీతంతో కూడిన కరాయేకి విధానం బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌ త్వరలో కరాయేకీ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో నేపథ్య సంగీతమే కాదు.. పాటకు సంబంధించిన పదాలు యానిమేషన్‌ రూపంలో కనిపిస్తాయి కూడా. వాటిని చూసుకుంటూ సంగీతానికి తగినట్టు ఎంచక్కా ఇష్టమైన పాటలను పాడుకోవచ్చు. యాపిల్‌ మ్యూజిక్‌ కరాయేకీ ఫీచర్‌లో 50కిపైగా ప్రత్యేకమైన పాటల జాబితా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ స్నేహితులతో కలిసి పాడాలనిపిస్తే డ్యూయెట్‌ వ్యూ సదుపాయాన్నీ వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని