ఛాట్‌ బదిలీ తేలికగా

వాట్సప్‌ లేకపోతే చేయి విరిగినట్టే అనిపిస్తుంది. ఇది అంతలా మన రోజువారీ వ్యవహారాలతో పెనవేసుకుపోయింది. ఆత్మీయులను చూస్తూ మాట్లాడాలన్నా, సుదీర్ఘంగా ఛాట్‌ చేయాలన్నా అంతా చూసేది వాట్సప్‌ వైపే. కొన్ని ఛాట్‌లు గుర్తుండిపోయేలా ఉండొచ్చు.

Published : 11 Jan 2023 00:51 IST

వాట్సప్‌ లేకపోతే చేయి విరిగినట్టే అనిపిస్తుంది. ఇది అంతలా మన రోజువారీ వ్యవహారాలతో పెనవేసుకుపోయింది. ఆత్మీయులను చూస్తూ మాట్లాడాలన్నా, సుదీర్ఘంగా ఛాట్‌ చేయాలన్నా అంతా చూసేది వాట్సప్‌ వైపే. కొన్ని ఛాట్‌లు గుర్తుండిపోయేలా ఉండొచ్చు. మళ్లీ మళ్లీ చూసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అయితే ఎప్పుడూ ఒకే ఫోన్‌ వాడలేం కదా. రోజుకో ఫీచర్‌తో ఫోన్లు అలరిస్తున్నాయాయె. కొత్త ఫోన్‌ కొన్నప్పుడల్లా వాట్సప్‌ ఛాట్‌ హిస్టరీని బదిలీ చేసుకోవటం పెద్ద తతంగమే. ఇందుకోసం ముందుగా గూగుల్‌ డ్రైవ్‌లో హిస్టరీని బ్యాకప్‌  చేసి, తర్వాత బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి అవసరమేమీ ఉండదు. క్లౌడ్‌ మీద కాకుండా స్థానిక నెట్‌వర్క్‌తోనే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి హిస్టరీని వేరే పరికరంలోకి బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌ త్వరలో ‘ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌’ ఫీచర్‌ను తీసుకురానుంది. భవిష్యత్‌ అప్‌డేట్‌తో పాటు ఇది అందుబాటులోకి వస్తుంది. పాత ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు. కొత్త ఫోన్‌లోకి హిస్టరీ మొత్తం బదిలీ అవుతుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రాక్సీ సపోర్టును కల్పించటాన్నీ వాట్సప్‌ ఆరంభించింది. దీంతో స్వచ్ఛంద సేవకులు, సంస్థలు స్థాపించిన సర్వర్ల ద్వారానే స్వేచ్ఛగా కనెక్ట్‌ కావటం సాధ్యమవుతుంది. ఇరాన్‌ వంటి దేశాల్లో ప్రాక్సీ సపోర్టు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. వాట్సప్‌ కనెక్షన్‌ను బ్లాక్‌ చేసినప్పుడు తిరిగి యాక్సెస్‌ చేసుకోవటానికిది వీలు కల్పిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని