ఫోన్‌ లేకపోయినా వాచ్‌తోనే నావిగేషన్‌

గూగుల్‌ సంస్థ వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌ఫోన్లకు ఫోన్‌ రహిత నావిగేషన్‌ సపోర్టును కల్పించింది. దీంతో ఫోన్‌తో అనుసంధానం కాకుండానే మ్యాప్స్‌లో ప్రయాణ మార్గాలను చూసుకోవచ్చు.

Published : 18 Jan 2023 06:03 IST

గూగుల్‌ సంస్థ వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌ఫోన్లకు ఫోన్‌ రహిత నావిగేషన్‌ సపోర్టును కల్పించింది. దీంతో ఫోన్‌తో అనుసంధానం కాకుండానే మ్యాప్స్‌లో ప్రయాణ మార్గాలను చూసుకోవచ్చు. అయితే వాచ్‌ల్లో ఎల్‌టీఈ ఇన్‌బిల్ట్‌గా ఉండాలి. లేదా వైఫై నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉండాలి. ఈ ఫీచర్‌ను వాడుకోవటానికి ముందుగా ఎల్‌టీఈ ఎనేబుల్‌ అయిన వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌వాచ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత సెటింగ్స్‌లోకి వెళ్లి, లాంచ్‌ మోడ్‌ను ఎంచుకోవాలి. దీని మెనూలో నావిగేషన్‌ కింద రెండు ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో వాచ్‌ ఓన్లీ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మ్యాప్స్‌ యాప్‌ను గానీ వాచీని గానీ అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సర్వర్‌ వైపు నుంచి అందే సదుపాయం మరి. అయితే ఇప్పటికిప్పుడే అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండకపోవచ్చు. కొద్దిరోజుల తర్వాత కనిపించొచ్చు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని