Google people card: మీ దగ్గర గూగుల్ పీపుల్ కార్డుందా?
ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యక్తిగత ముద్ర, ఆన్‌లైన్ ఉనికి మరింత ముఖ్యంగా మారిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే గూగుల్ సంస్థ ‘పీపుల్ కార్డు’ ఫీచర్‌ను తీసుకొచ్చింది
ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యక్తిగత ముద్ర, ఆన్‌లైన్ ఉనికి మరింత ముఖ్యంగా మారిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే గూగుల్ సంస్థ ‘పీపుల్ కార్డు’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు సరైన వ్యక్తిని గుర్తించటానికిది తోడ్పడుతుంది. ఒకరకంగా దీన్ని డిజిటల్ బిజినెస్ కార్డులాంటిది అనుకోవచ్చు. సెర్చ్ రిజల్ట్స్‌లో గూగుల్ మనకు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖంగా చూపటానికిది వీలు కల్పిస్తుంది. పీపుల్ కార్డు ఫీచర్ ప్రస్తుతానికి మనదేశంతో పాటు కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ లేదా హిందీ భాషల్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు. మరి పీపుల్ కార్డును ఎలా సృష్టించుకోవాలో చూద్దామా..
* స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్‌ను ఓపెన్ చేసి ‘యాడ్ మీ టు సెర్చ్’ అని టైప్ చేయాలి.
* ‘యాడ్ యువర్‌సెల్ఫ్ టు గూగుల్ సెర్చ్’ రిజల్ట్‌లో ‘గెట్ స్టార్టెడ్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
* పేరు, ప్రాంతం, పని, చదువు, ఈమెయిల్, వెబ్‌సైట్ ఉంటే దాని పేరు వంటి వివరాలన్నీ నింపాలి. ఇవి చాలా ముఖ్యం. వీటిని గూగుల్ మన కార్డు మీద చూపిస్తుంది. కాబట్టి తప్పులు లేకుండా వివరాలను నింపాలి.
* కావాలనుకుంటే ఫేస్‌బుక్, యూట్యూబ్, లింక్డ్‌ఇన్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ హ్యాండిళ్లనూ జోడించుకోవచ్చు.
* కాంటాక్ట్ వివరాలను ప్రదర్శించటానికి గూగుల్ అనుమతి కోరుతుంది. ఇష్టముంటే ఇవ్వచ్చు.
* అవసరమైన సమాచారాన్ని పూరించాక ప్రివ్యూను చెక్ చేసుకోవాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.
* తర్వాత కార్డును సేవ్ చేసుకోవాలి. ఆ వెంటనే మన గూగుల్ పీపుల్‌కార్డు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది.
-మొబైల్‌ఫోన్‌లో గూగుల్ బ్రౌజర్‌తోనూ పీపుల్ కార్డును సృష్టించుకోవచ్చు. మున్ముందు అవసరమైతే కార్డును ఎడిట్ చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి