టీమ్స్‌లో కదిలే నేపథ్యం!

మైక్రోసాఫ్ట్‌ వీడియో కాలింగ్‌ వేదిక టీమ్స్‌ ఎప్పటికప్పుడు కొత్తగా ముస్తాబవుతోంది. తాజాగా కదిలే యానిమేషన్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకునే సదుపాయంతో మరింత ఆకర్షణీయంగా మారిపోయింది

Published : 10 May 2023 00:20 IST

మైక్రోసాఫ్ట్‌ వీడియో కాలింగ్‌ వేదిక టీమ్స్‌ ఎప్పటికప్పుడు కొత్తగా ముస్తాబవుతోంది. తాజాగా కదిలే యానిమేషన్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకునే సదుపాయంతో మరింత ఆకర్షణీయంగా మారిపోయింది. దీంతో అసలు బ్యాక్‌గ్రౌండ్‌ను డిజిటల్‌ వాల్‌పేపర్‌తో అలంకరించుకోవచ్చు. ఇందుకోసం పీసీలో మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ తాజా వర్షన్‌ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. విండోస్‌ 11 పరికరమైతే అప్‌టుడేట్‌గా ఉన్నట్టే. కాల్‌కు జాయిన్‌ అవుతున్నప్పడు లేదా కొత్త కాల్‌ను క్రియేట్‌ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకోవచ్చు. హోంపేజీలో క్లిక్‌ బటన్‌ మీద నొక్కితే వీడియో ప్రివ్యూలు కనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ ఫిల్టర్స్‌ మీద నొక్కి, ఎడమవైపున కనిపించే ఫొటోలను ఎంచుకోవాలి.
* స్మార్ట్‌ఫోన్‌లోనైతే- ఈమెయిల్‌ ఐడీ ఉపయోగించుకొని టీమ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పైన కుడిమూలన కనిపించే ‘మీట్‌’ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేసి, స్టార్ట్‌ మీటింగ్‌ను ఎంచుకోవాలి. తర్వాత ‘చేంజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌’ ఆప్షన్‌ను నొక్కి, యానిమేషన్‌ లేదా పిక్చర్‌ను ఎంచుకోవాలి. దీంతో బ్యాక్‌గ్రౌండ్‌ డైనమిక్‌గా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని